Cake Offerings Ban : కేకును నైవేద్యంగా అందించడంపై ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న కాలభైరవ ఆలయం బ్యాన్ విధించింది. ఇందుకు కారణం.. మమతా రాయ్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవలే తన బర్త్‌డే సందర్భంగా కాలభైరవ ఆలయ దర్శనానికి మమతా రాయ్ వచ్చారు. ఆలయం గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ వెంటనే గర్భగుడిలోనే బర్త్ డే కేక్‌పై ఆమె కొవ్వొత్తులు వెలిగించారు.. వాటిని ఊదారు.. ఆర్పారు.. చివరగా కేక్‌ను కట్ చేసి, ఒక ముక్కను భగవంతుడికి నైవేద్యంగా మమతా రాయ్ సమర్పించారు.
How can someone be allowed to cut cake inside a temple? Ordinary devotees aren’t even allowed to stop there even for 30 seconds….
This is really shameful…. More than these Reelbaaz, temple managements are responsible for reducing our temples into a joke… pic.twitter.com/dKfbWZ0rcl
— Mr Sinha (@MrSinha_) November 30, 2024
Also Read :Sabarmati Report: ఇవాళ సాయంత్రం పార్లమెంటులో సినిమా చూడనున్న ప్రధాని మోడీ
దీనికి సంబంధించిన వీడియోను తీసి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంటులో ఆమె పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో క్రేజ్‌ను పెంచుకునేందుకు చివరకు ఆలయం గర్భగుడిని కూడా మమతా రాయ్(Cake Offerings Ban) వేదికగా చేసుకోవడంపై నెటిజన్ల మండిపడుతున్నారు. ఈవిషయంపై కాలభైరవ ఆలయ నిర్వాహకులు కూడా విస్మయం వ్యక్తం చేశారు. ఆలయం లోపల కేక్‌లు కట్ చేయడం, కేక్‌ను నైవేద్యంగా సమర్పించడాన్ని బ్యాన్ చేయాలని నిర్ణయించారు.
Also Read :War and Business : 100 కంపెనీలకు కలిసొచ్చిన యుద్ధాలు.. ఏడాదిలో రూ.53 లక్షల కోట్ల బిజినెస్
ఈ ఘటన వల్ల ఆలయ పవిత్రతకు భంగం కలిగిందని వారణాసిలోని మతపరమైన సంస్థ ‘కాశీ విద్వత్ పరిషత్’ పేర్కొంది. ఈవిషయంలో మమతా రాయ్‌కు లీగల్ నోటీసులు పంపాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ‘‘బర్త్ డే సందర్భంగా భగవంతుడికి పూజలు చేయొచ్చు. ఆలయంలో కొవ్వొత్తులు ఊదడం, కేక్ కట్ చేయడం సరికాదు. అలాంటి ఆచారాలకు హిందూయిజంలో చోటులేదు. దీనిపై యూపీ సీఎంను మేం సంప్రదిస్తాం’’ అని కాశీ విద్వత్ పరిషత్ ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ్ ద్వివేది చెప్పారు.