Uniform Civil Code : ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) సోమవారం (జనవరి 27) నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అమల్లోకి రానుంది. దీంతో దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి ఇవాళ (ఆదివారం) ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. యూసీసీ అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ఈ చట్టం అమలుపై అధికారులకు శిక్షణ పూర్తయిందన్నారు. ‘‘యూసీసీ అమలుతో సమాజంలో ఏకరూపత వస్తుంది. పౌరులందరికీ సమాన హక్కులు, బాధ్యతలు అందుబాటులోకి వస్తాయి’’ అని సీఎం ధామి చెప్పారు.
Also Read :Rain Free In Cafe : ఈ కేఫ్‌లో వర్షం ఫ్రీ.. కాఫీని సిప్ చేయగానే జోరువాన
ఉత్తరాఖండ్ యూసీసీలోని ముఖ్యాంశాలు
- వివాహాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అన్ని మతాల వారు ఒకే వ్యవస్థ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- సహ జీవన సంబంధాలను కలిగిన వారు కూడా తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- సైనికులు, వాయుసేనలో పని చేస్తున్నవారు, యుద్ధంలో నిమగ్నమై ఉన్నవారు, నౌకాదళంలో ఉన్నవారి కోసం ప్రివిలేజ్డ్ విల్ సౌకర్యం ఉంటుంది. వారు అత్యవసర పరిస్థితుల్లో ఈవిధంగా వీలునామాను రాయించుకోవచ్చు.
- అన్ని మతాల స్త్రీ, పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది.
- అన్ని మతాల్లో బహుభార్యత్వాన్ని బ్యాన్ చేశారు. ఓ వర్గం వారిలో ఉన్న బహుభార్యత్వ పద్ధతికి ఉత్తరాఖండ్‌లో బ్రేక్ పడనుంది.
- ఓ వర్గానికి చెందిన హలాలా విధానంపై బ్యాన్ విధించారు.
Also Read :Deputy CM Bhatti : తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేంద్రం అవమానించింది.. ‘పద్మ అవార్డుల’పై డిప్యూటీ సీఎం భట్టి స్పందన
బిల్లు గురించి..
- సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి రంజనా ప్రకాశ్ దేశాయ్ సారథ్యంలో నిపుణుల కమిటీ యూసీసీ(Uniform Civil Code) ముసాయిదా బిల్లును తయారు చేసింది.
- 2022 మే 27న ఏర్పాటైన ఈ కమిటీ దాదాపు ఏడాదిన్నర పాటు కసరత్తు చేసి నాలుగు సంచికల్లో యూసీసీ ముసాయిదా బిల్లును తయారు చేసింది.
- ఈ బిల్లును 2024 ఫిబ్రవరి 7న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదించింది.