Uttarakhand – UCC : పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత తదితర అంశాల్లో అన్ని వర్గాల ప్రజలకు ఒకే విధమైన చట్టాలను తీసుకొచ్చేదే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ). ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్.. యూసీసీ దిశగా అడుగులు వేస్తోంది. యూసీసీ అమలు సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ 2022 మే నెలలోనే ఐదుగురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నివేదిక అందగానే యూసీసీని అమలు చేస్తామని చాలాసార్లు సీఎం పుష్కర్ సింగ్ దామీ చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈనేపథ్యంలో మరో నాలుగు రోజుల్లోగా యూసీసీపై ఏర్పాటు చేసిన కమిటీ.. తన నివేదికను ఉత్తరాఖండ్ సర్కారుకు సమర్పించనుంది. అది అందిన వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి యూసీసీ బిల్లుకు చట్టరూపం ఇవ్వాలని సీఎం పుష్కర్ సింగ్ దామీ సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. దేశంలో యూసీసీని అమల్లోకి తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలుస్తుంది. ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమలయ్యాక.. 2024 ఎన్నికలకు ముందే గుజరాత్‌లోనూ యూసీసీని అమలు చేయాలని బీజేపీ యోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక స్వాతంత్ర్యానికి ముందు నుంచే గోవాలో యూసీసీ(Uttarakhand – UCC) అమలవుతోంది.
