Massive Accident : ఉత్తరాఖండ్ రాష్ట్రం పిథోరాగఢ్ జిల్లాలో జూలై 15న సాయంత్రం జరిగిన ఘోర రోడ్డుప్రమాదం తీవ్ర విషాదానికి కారణమైంది. మువానీ నుంచి బక్టా వెళ్తున్న టాక్సీ ఓ వంతెన సమీపంలో అదుపుతప్పి సుమారు 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో టాక్సీలో ఉన్న 13 మంది ప్రయాణికులలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు.
Kiara Advani : పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ కియారా అద్వానీ
ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గాయపడినవారిని లోయలో నుంచి సురక్షితంగా బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. ప్రాథమికంగా వాహనం అదుపుతప్పిందన్న అనుమానం వ్యక్తమవుతోంది.
ఈ ఘటన మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో జిల్లా కేంద్రానికి 52 కిలోమీటర్ల దూరంలో జరిగింది. ప్రమాద సమయంలో భయానకంగా కేకలు వినిపించాయన్న సమాచారంతో స్థానికులు స్పందించి సహాయ చర్యలకు దూసుకొచ్చారు.
ఈ దుర్ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడినవారికి తగిన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
Tuna Fish : టూనా ఫిష్ తింటే గుండె జబ్బులు దూరం.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు!