Site icon HashtagU Telugu

Jay Shah : అమిత్‌షా కుమారుడి పేరుతో బీజేపీ ఎమ్మెల్యేలకు ఫోన్‌.. దొరికిన మోసగాడు

Uttarakhand Mla Amit Shah Jay Shah Bjp Mla

Jay Shah : అతగాడు ఉత్తరాఖండ్‌లోని పలువురు ఎమ్మెల్యేలకు ఫోన్ కాల్ చేశాడు. తనను తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా  కుమారుడు జై షా(Jay Shah)గా పరిచయం చేసుకున్నాడు. తనకు డబ్బులిస్తే రాష్ట్ర మంత్రి పదవులు ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఈక్రమంలోనే ఎమ్మెల్యే ఆదేశ్‌ చౌహాన్‌కు సదరు వ్యక్తి  ఫోన్‌కాల్‌ చేసి, పార్టీ చేసుకునేందుకు రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఒకవేళ డబ్బులు ఇవ్వకుంటే, తమ మధ్య జరిగిన సంభాషణను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు.

Also Read :5000 Dollars Gift : పన్ను చెల్లించే వాళ్లకు రూ.4.30 లక్షల గిఫ్ట్.. అందరి ఇళ్లకు చెక్కులు

విలాసవంతమైన జీవితం కోసమే..

సదరు ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి, ఢిల్లీలో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ కాల్స్ చేసిన వ్యక్తిని ఉత్తరాఖండ్‌కే చెందిన ప్రియాంషు పంత్‌ (19)గా గుర్తించారు. ఈ కాల్స్ చేసే క్రమంలో అతడికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకే ప్రియాంషు పంత్‌ ఉత్తరాఖండ్ ఎమ్మెల్యేలకు ఫోన్ కాల్స్ చేసి, డబ్బులు అడిగాడని విచారణలో తేలింది.నిందితుడు ప్రియాంషు పంత్‌.. నైనితాల్‌ ఎమ్మెల్యే సరిత ఆర్య, రుద్రాపుర్‌ ఎమ్మెల్యే శివ్‌ ఆరోడాలకు కూడా ఫోన్‌ చేసి డబ్బులు అడిగాడని తేలింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇప్పిస్తానంటూ డబ్బులు అడిగాడని వెల్లడైంది.

Also Read :Qatar King : రేంజే వేరప్ప.. ఖతర్ రాజు కళ్లు చెదిరే సంపద

మాజీ సీఎం కుమార్తెను.. 

ఇటీవలే ఉత్తరాఖండ్ మాజీ సీఎం రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ కుమార్తె ఆరుషి నిశాంక్ కూడా ఇదే విధంగా మోసపోయారు. తాము తీయనున్న సినిమాలో హీరోయిన్ పాత్రను  ఇస్తామంటూ  ఆరుషి నిశాంక్‌కు ముంబైకి చెందిన మాన్సీ వరుణ్ బాగ్లా, వరుణ్ ప్రమోద్ కుమార్ బాగ్లా కుచ్చుటోపీ పెట్టారు.  రూ.4 కోట్లు తీసుకొని బిచాణా ఎత్తేశారు.  దీనిపై  ఆరుషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆరుషికి మొదటి నుంచీ నటన అంటే ఇష్టం. సినిమాల్లో నటించేందుకు, సొంతంగా సినిమాలు తీసేందుకు హిమశ్రీ ఫిల్మ్స్ పేరుతో ఒక సంస్థను ఆమె నిర్వహిస్తున్నారు.