Reels On Track : రైల్వే ట్రాక్‌పై రీల్స్.. రైలు కింద నలిగిపోయిన దంపతులు, పసికందు

ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి చెందిన ప్రజల నుంచి సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని(Reels On Track) సందర్శించారు.

Published By: HashtagU Telugu Desk
Reels On Tracks Couple Run Over By Train

Reels On Track : ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసే సరదా ఆ కుటుంబం మొత్తాన్ని బలిగొంది. ఆ దంపతులు సరదా కోసం రైల్వే ట్రాక్‌పైకి వెళ్లారు. తమ మూడేళ్ల కుమారుడితో కలిసి రీల్స్ దిగుతుండగా ..వెనుక నుంచి వారిపైకి వేగంగా రైలు దూసుకొచ్చింది. దీంతో ఆ ముగ్గురి ప్రాణాలు అక్కడికక్కడే గాల్లో కలిశాయి. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీ జిల్లాలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.

Also Read :Mahatma Gandhi : మహాత్మాగాంధీకి ప్రత్యేక రైల్వే బోగీ అంకితం.. విశేషాలివీ..

లఖీంపూర్ ఖేరీ జిల్లా ఆయిల్ రైల్వే క్రాసింగ్ సమీపంలో ఉమారియా కల్వర్టు వద్ద  దంపతులు రీల్స్ తీసుకుంటుండగా ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో చనిపోయిన దంపతుల పేర్లు మహ్మద్ అహ్మద్ (26), ఆయిషా (24). వారి కుమారుడి పేరు అబ్దుల్లా (3). వాళ్లు యూపీలోని సీతాపూర్ పరిధిలో ఉన్న లహర్ పూర్ వాస్తవ్యులని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో రైలు ఢీకొన్నాక ముగ్గురికి తీవ్ర రక్తస్రావమైంది. శరీర భాగాలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి చెందిన ప్రజల నుంచి సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని(Reels On Track) సందర్శించారు. ముగ్గురు డెడ్‌బాడీలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Also Read :Palestine In UN : తొలిసారిగా ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు సీటు.. ఇజ్రాయెల్ భగ్గు

ఈ ఘటనతో బాధిత కుటుంబానికి చెందిన స్వగ్రామం లహర్ పూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమవాళ్లకు ఇలా జరుగుతుందని కలలో కూడా భావించలేదని.. మహ్మద్ అహ్మద్ (26), ఆయిషా (24) దంపతుల బంధువులు రోదిస్తున్నారు. రైల్వే ట్రాక్‌పై రీల్స్ తీసుకునే అలవాటు ప్రమాదకరమైందని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. రైల్వే ట్రాక్‌లపై ఇలా ఎవరూ చేయొద్దని సూచిస్తున్నారు. రైళ్ల రాకపోకలకు ఉద్దేశించిన ప్రదేశంలో వినోద కార్యకలాపాలు ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నిస్తున్నారు. మరెవరూ ఈ తరహాలో ప్రవర్తించి ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని రైల్వే అధికారులు కోరుతున్నారు.

  Last Updated: 11 Sep 2024, 05:04 PM IST