Shocking : భారత్‌కు స్నేహపూర్వక దేశంగా మాటలతో మేళం వేసే అమెరికా, మరోవైపు పాక్‌కు వెన్నుతొక్కే ప్రవర్తనతో నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్న భారత్‌కు మద్దతు ఇచ్చే బదులు, పాక్‌ను ప్రశంసిస్తూ వేదికలపై పొగడ్తలతో ముంచేస్తోంది. తాజా ఘటనగా అమెరికా జనరల్ మైఖేల్ కురిల్లా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, పాకిస్తాన్ ఉగ్రవాదంపై పోరాటంలో ‘అసాధారణ పాత్ర’ పోషించిందని కురిల్లా వ్యాఖ్యానించారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను కూడా విపరీతంగా పొగిడారు. భారత్‌తో ఉన్న సంబంధాల వల్ల పాక్‌తో సంబంధాలు మానాల్సిన అవసరం లేదని, రెండు దేశాలతోనూ స్నేహం కొనసాగాలని వ్యాఖ్యానించడం దేశంలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది.
ఇదిలా ఉండగా, ఇటీవలే జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌ను అంతర్జాతీయంగా ఒంటరిగా చేయాలని భారత్ యత్నిస్తుండగా, అమెరికా ఈ సమయంలో పాక్‌కు మద్దతు ఇవ్వడం ప్రశ్నార్థకమవుతోంది. ముఖ్యంగా, పాక్ ఆర్మీ చీఫ్‌ను జూన్ 14న జరగనున్న 250వ అమెరికా ఆర్మీ డే వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానించడంపై భారత్ లోపల రాజకీయ వేడి చెలరేగుతోంది. ఇదే రోజున ట్రంప్ పుట్టినరోజు కావడంతో అసిమ్ మునీర్ వాషింగ్టన్ చేరనున్నారని సమాచారం.
ఇకపోతే, చైనా–పాక్ మధ్య గాఢమవుతున్న సంబంధాలకు చెక్ పెట్టడమే అమెరికా లక్ష్యమా? లేక భారత్‌ను ఒత్తిడిలో పెట్టేందుకో? అనే చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా దూకుడు మీద భారత్ అప్రమత్తమై సమతౌల్య దౌత్యంతో ముందడుగు వేయాలనే సూచనలు వినిపిస్తున్నాయి.
AP News : ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమకు ఊపిరి.. పవన్ నేతృత్వంలో కీలక భేటీకి రంగం సిద్ధం..!