Indian Immigrants : ఓవైపు భారత్‌కు చైనా చేరువ అవుతుంటే.. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా షాక్ ఇచ్చింది. తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను ప్రత్యేక విమానంలో భారత్‌కు అమెరికా పంపించింది. అక్రమ వలసదారులను నియంత్రించే చర్యలలో భాగంగా ఇలా చేయాల్సి వచ్చిందని అమెరికా హోంశాఖ ప్రకటించింది. భారత్‌కు చెందిన అక్రమ వలసదారులను అక్టోబరు 22న ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపినట్లు తెలిపింది. ఈక్రమంలో భారత ప్రభుత్వ సహకారాన్ని కూడా తీసుకున్నామని పేర్కొంది. అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన భారత ప్రజలు(Indian Immigrants) స్మగ్లర్ల చేతిలో బందీలుగా మారకుండా ఉండేందుకే తాము ఇలా చేసినట్లు అమెరికా తెలిపింది.
Also Read :Union Bank Of India : తెలంగాణ, ఏపీలలో చెరో 200 బ్యాంక్ జాబ్స్
145 దేశాల వాళ్లు బ్యాక్
- భారత్‌తో పాటు కొలంబియా, ఈక్వెడార్, పెరూ, ఈజిప్ట్, మారిటానియా, సెనెగల్, ఉజ్బెకిస్థాన్, చైనా దేశాలకు చెందిన పలువురు అమెరికాకు అక్రమ మార్గాల్లో వెళ్లే ప్రయత్నాలు చేస్తుంటారు.
- ఉద్యోగ అవకాశాలు, మంచి సంపాదన కోసమే ఈవిధంగా అక్రమంగా అమెరికాకు వెళ్లేందుకు జనం ఆసక్తి చూపుతుంటారు.
- చట్టపరమైన మార్గాల్లో అమెరికాకు వెళ్లే విధానాలు చాలా టఫ్‌గా ఉంటాయి. అందువల్లే ఈజీగా ఉండే అక్రమ పద్ధతులను అవలంభించేందుకు కొందరు మొగ్గుచూపుతుంటారు.
- ఈవిధంగా అక్రమంగా అమెరికాకు వెళ్లేందుకు యత్నించే వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు.
- 2024 ఆర్థిక సంవత్సరంలో 145 దేశాలకు చెందిన దాదాపు 1.60 లక్షల మంది అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపించింది. ఇందుకోసం 495కు పైగా ప్రత్యేక విమానాలను వినియోగించింది.
Also Read :Eyeballs Offering : ఆ దేవతకు కనుబొమ్మలనూ మొక్కుగా సమర్పిస్తారు
- అక్రమంగా అమెరికాలోకి చొరబడేందుకు యత్నించే వారికి మెక్సికో, కెనడాలు ప్రధాన ద్వారాలుగా ఉన్నాయి.
- మెక్సికో నుంచి అమెరికాలోకి వెళ్లే దారిని డాంకీ రూట్ అని పిలుస్తారు. అయితే ఈ రూటు ద్వారా ప్రజలను పంపేముందు.. వారిని ఏజెంట్లు దుబాయ్ లేదా టర్కీలో ఉంచుతున్నారు.
- ఆ టైంలోనే అమెరికా నిఘా వర్గాలను అక్రమ వలసదారులను పట్టుకుంటున్నాయి.
- ప్రస్తుతం ఎక్కువగా కెనడాలోని అక్రమ మార్గాల ద్వారా జనం అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు.
- కెనడాకు టూరిస్టు వీసాపై వెళ్లి అక్కడి నుంచి అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు.