US Vs Indian Companies : బ్రిక్స్ కూటమి సదస్సు జరిగి కొన్ని వారాలైనా గడవకముందే.. రష్యా, దాని అత్యంత సన్నిహిత దేశాలపై అమెరికా ఆంక్షల కొరడా ఝుళిపించింది. ప్రపంచవ్యాప్తంగా రష్యా మిత్రదేశాలకు చెందిన దాదాపు 400కుపైగా కంపెనీలు/వ్యక్తులపై అమెరికా ఆంక్షలను ప్రకటించింది. వీటిలో 19 కంపెనీలు భారత్‌లో ఉండటం గమనార్హం. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్దానికి అవసరమైన సాయం చేస్తున్నాయనే అభియోగంతో ఈ సంస్థలు/వ్యక్తులపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలను ఎదుర్కొంటున్న కంపెనీలున్న దేశాల జాబితాలో భారత్‌తో పాటు చైనా, స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్, టర్కీ ఉన్నాయి. యుద్ధంలో రష్యాకు సైనికపరంగా చేదోడునిచ్చే యంత్రాలు, పరికరాలు, విడి భాగాలు, పేలుడు సామగ్రిని అందించాయనే అభియోగాన్ని ఈ దేశాలపై అమెరికా మోపింది. రష్యా రక్షణశాఖకు చెందిన సీనియర్ అధికారులు, ఆ దేశపు రక్షణ రంగ కంపెనీలపై కూడా అమెరికా ఆంక్షలు(US Vs Indian Companies) విధించడం గమనార్హం. రష్యా ఇంధన ఉత్పత్తి, ఎగుమతి కంపెనీలపైనా అగ్రరాజ్యం కొరడా ఝుళిపించింది.
Also Read :Insulin Resistance : ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారు ఖాళీ కడుపుతో ఈ ఆహారాలను తినాలి!
ఉక్రెయిన్‌పై అక్రమంగా, అన్యాయంగా రష్యా దండయాత్ర చేస్తోందని అమెరికా ఆర్థికశాఖ డిప్యూటీ సెక్రెటరీ వాలీ అడెయెమో ఈసందర్భంగా తెలిపారు. ఇలాంటి అన్యాయాన్ని అమెరికా సహించదన్నారు. తమ మిత్రదేశాలకు ఎల్లప్పుడూ అండగానే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. రష్యాకు సైనికపరంగా మద్దతునివ్వడం ద్వారా దాని దురాక్రమణకు సాయం చేయడాన్ని తాము సహించబోమన్నారు. రష్యాకు కంప్యూటర్ న్యూమెరికల్ కంట్రోల్ సరుకులు, మైక్రో ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఎగుమతులపై ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆయన ప్రకటించారు. వీటిని ప్రధానంగా చైనా, భారత్, కజకిస్తాన్, టర్కీ, యూఏఈలు రష్యాకు సప్లై చేస్తున్నట్లు గుర్తించామన్నారు.
Also Read :Prashant Kishor : PK సలహా ఫీజు రూ.100 కోట్లు..!!
అమెరికా ఆంక్షలపై భారత్ స్పందించింది. తాము రష్యాతో లీగల్‌గానే వ్యూహాత్మక వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. న్యూక్లియర్, రసాయన ఆయుధాల తయారీని నిరోధించే మూడు వేర్వేరు కూటముల్లో భారత్ సభ్యదేశంగా ఉందని.. వాటి నిబంధనలను తమ దేశం తు.చ తప్పకుండా ఫాలో అవుతోందన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలకు భారత్ కట్టుబడి ఉంటుందని జైస్వాల్ తెలిపారు.