Sonobuoy : అమెరికా నుంచి భారత్‌కు మరింత అధునాతన ఆయుధ సంపత్తి అందనుంది. ఈసారి యాంటీ సబ్‌మెరైన్ ఆయుధ టెక్నాలజీ ‘సోనో బ్యుయ్’లను అమెరికా నుంచి భారత్ అందుకోనుంది. దాదాపు రూ.442 కోట్లు విలువైన ‘సోనో బ్యుయ్’లను భారత్‌కు అగ్రరాజ్య సప్లై చేయనుంది. ఈ విక్రయ ప్రతిపాదనకు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రకటించారు. ఈవిషయాన్ని అమెరికా రక్షణశాఖకు చెందిన భద్రతా సహకార సంస్థ కూడా ధ్రువీకరించింది.ఈ డీల్‌లో భాగంగా ఏఎన్/ఎస్ఎస్‌క్యూ – 53జీ హై ఆల్టిట్యూడ్ యాంటీ సబ్ మెరైన్ వార్ఫేర్ (HAASW) రకం సోనో బ్యుయ్‌లు భారత సైన్యానికి అందుబాటులోకి వస్తాయి.
We’re now on WhatsApp. Click to Join
ఏమిటీ ‘సోనో బ్యుయ్’ ?
‘సోనార్’, ‘బ్యుయ్’ అనే రెండు పదాల కలయిక వల్ల ‘సోనో బ్యుయ్’ అనే పదం ఏర్పడింది. సముద్ర జలాల లోపల ఏవైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని అనుమానం వస్తే సోనార్ తరంగాలను ఆ దిశగా విడుదల చేస్తారు. సముద్రం లోపల ఏవైనా వస్తువులు ఉంటే .. వాటిని సోనార్ తరంగాలు తాకి వెనక్కి వచ్చేస్తాయి. ఈ తరంగాలు ఎంత సేపట్లో వెనక్కి తిరిగి వచ్చాయనే దాని ఆధారంగా సముద్రంలోపల ఎంతదూరంలో సదరు అనుమానాస్పద వస్తువు ఉందనే దానిపై ఒక అంచనాకు వస్తారు. బ్యుయ్ అంటే సముద్ర జలాలపై తేలియాడే పరికరం.
Also Read :Profile Song : ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ప్రొఫైల్ సాంగ్’ ఫీచర్.. ఇలా సెట్ చేసుకోండి
సోనార్, బ్యుయ్ అనే రెండు టెక్నాలజీలను కలగలిపి సముద్రంలోని శత్రు జలాంతర్గాముల జాడను కచ్చితత్వంతో గుర్తించడానికి సోనో బ్యుయ్‌లను తయారు చేస్తారు. సముద్ర జలాల్లో చైనా, పాకిస్తాన్ ఆర్మీల ఉనికి ఇటీవల కాలంలో పెరిగింది. ఈనేపథ్యంలో సముద్రంలో ఉన్న ఆయా దేశాల జలాంతర్గాముల జాడను గుర్తించేందుకు భారత్ రెడీ అవుతోంది. ఈక్రమంలోనే రూ.442 కోట్లు విలువైన ‘సోనో బ్యుయ్’లను అమెరికా నుంచి కొంటోంది. పొరుగున ఉన్న చైనాను భారత్ ధీటుగా ఎదుర్కొనాలనేది అమెరికా వ్యూహం. అందుకే భారత్‌కు అన్ని విధాలా సైనిక సహకారాన్ని అందిస్తోంది.