దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2024 తుది ఫలితాలు (UPSC Results) ఇటీవల విడుదలయ్యాయి. ఈ పరీక్షల ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర సర్వీసుల కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈసారి మొత్తం 1,009 మందిని ఎంపిక చేసినట్లు యూపీఎస్సీ ప్రకటించింది. జనరల్ కేటగిరీ నుంచి 335 మంది, ఓబీసీ నుంచి 318 మంది, ఎస్సీ 160 మంది, ఎస్టీ 87 మంది, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నుంచి 109 మంది ఎంపికయ్యారు. ఈ ఫలితాలు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు నూతన ఆశలు నింపాయి.
Tanda Gangs : తెలుగు రాష్ట్రాల్లో టాండా దొంగలు.. ఎవరు ?
తుది ఫలితాల ప్రకటనకు ముందు, ప్రిలిమినరీ పరీక్షలు 2024 జూన్ 16న నిర్వహించగా, మెయిన్స్ సెప్టెంబర్‌లో జరిగాయి. అనంతరం ఇంటర్వ్యూలు ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య రెండు సెషన్లలో నిర్వహించడంతో ఎంపిక ప్రక్రియ ముగిసింది. ఈ మొత్తం ప్రక్రియలో 2,845 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించగా, చివరికి 1,009 మందికి అఖిల భారత స్థాయిలో ర్యాంకులు లభించాయి. టాప్ 10 ర్యాంకర్లలో శక్తి దుబే మొదటి స్థానాన్ని దక్కించుకోగా, హర్షిత గోయెల్, డోంగ్రే అర్చిత్ పరాగ్, షా మార్గి చిరాగ్ వంటి అభ్యర్థులు ప్రథమ స్థానాల్లో నిలిచారు.
ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఈసారి తమ ప్రతిభను చాటారు. ముఖ్యంగా సాయి శివాని 11వ ర్యాంకుతో టాప్ 20లో చోటు దక్కించుకుంది. బన్నా వెంకటేశ్ 15వ స్థానం, అభిషేక్ శర్మ 38వ స్థానం, రావుల జయసింహారెడ్డి 46వ స్థానం సాధించారు. అలాగే శ్రవణ్ కుమార్ రెడ్డి (62), సాయి చౌతన్య జాదవ్ (68), ఎన్. చేతనరెడ్డి (110), చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి (119) వంటి విద్యార్థులు అద్భుతంగా ర్యాంకులు సాధించారు. ఈ విజయాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యుపిఎస్సీ ఆశావహులకు ప్రేరణగా నిలుస్తున్నారు.