Most Popular CMs : దేశంలోనే పాపులర్ సీఎంల లిస్టు చూశారా ?

Most Popular CMs : దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రులు ఎవరు ?

  • Written By:
  • Updated On - February 18, 2024 / 08:09 AM IST

Most Popular CMs : దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రులు ఎవరు ? అనే దానిపై ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. నంబర్ 2 ప్లేస్‌లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిలిచారు. ఆయనకు  51.3 శాతం పాపులారిటీ రేటింగ్‌ లభించింది. నంబర్ 1 ప్లేసులో నిలిచిన సీఎం(Most Popular CMs) ఎవరు ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంల జాబితాలో నంబర్ 5 ప్లేస్‌లో త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా నిలిచారు. సర్వేలో పాల్గొన్న ప్రజలు.. మాణిక్ సాహా సరళత, అంకితభావం, నిజాయితీలను మెచ్చుకున్నారు. తమ సుఖదుఃఖాల్లో పాలుపంచుకునే కరుణామయ నాయకుడు సాహా అని ప్రజలు కొనియాడారు. వాస్తవానికి మాణిక్ సాహా ఒక డెంటల్ సర్జన్. 2023 మార్చిలో జరిగిన ఎన్నికల్లో త్రిపురలో బీజేపీ గెలవడంలో ఆయన పాత్రే కీలకం. వరుసగా రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మాణిక్ సాహా 2016లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఆయన 2020లో రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా నియమితులయ్యారు. 2022 మార్చిలో రాజ్యసభకు ఎన్నికయ్యారు.

Also Read : Actor Sunny Leone: సన్నీ లియోన్ పేరుతో కానిస్టేబుల్‌ అడ్మిట్ కార్డు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..!

  • సర్వే ప్రకారం.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 52.7 శాతం పాపులారిటీ రేటింగ్‌తో నంబర్ 1 ప్లేసులో నిలిచారు.
  • ఈ లిస్టులో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్  నంబర్ 1 ప్లేస్‌లో నిలవడం ఇది ఏడోసారి. 2023 ఆగస్టులో ఆయన పాపులారిటీ రేటింగ్ 61.3 శాతం ఉండగా, ఇప్పుడది 52.7 శాతానికి తగ్గింది.
  • ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 51.3 శాతం పాపులారిటీ రేటింగ్‌తో రెండో స్థానంలో నిలిచారు.
  • 48.6 శాతం రేటింగ్‌తో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ మూడో స్థానంలో నిలిచారు.
  • గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 42.6 శాతం రేటింగ్‌తో నాలుగో స్థానంలో ఉన్నారు.

Also Read : YS Sharmila : షర్మిల కుమారుడి పెళ్లి ఫొటోలివీ.. వేడుకకు జగన్ దూరం

ఈ సర్వే  రిపోర్ట్ ప్రకారం.. బీజేపీయేతర పార్టీల సీఎంల(Most Popular CMs)  పాపులారిటీ గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. నంబర్ 1 ప్లేసులో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్  నిలవగా,  ఆయన తర్వాతి ఆరు స్థానాలలో బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలే ఉన్నారు.  బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు అందరికీ అప్రూవల్ రేటింగ్ 40 శాతానికిపైనే ఉంది. మరోవైపు బీజేపీయేతర రాష్ట్రాల సీఎంల గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది.  ఉదాహరణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈ ఏడాది  పాపులారిటీ రేటింగ్ 36.5 శాతానికి తగ్గిపోయింది. 2023 ఆగస్టు నాటికి ఇది  57.7 శాతంగా ఉండేది.