దేశవ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI down in India) సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి ప్రముఖ డిజిటల్ చెల్లింపు యాప్‌లు (GPay, Paytm and other UPI apps) పనిచేయకపోవడంతో ఆన్‌లైన్ లావాదేవీలు నిలిచిపోయాయి. సాయంత్రం 7 గంటల తర్వాత ఈ సమస్య ఉత్పన్నమైనట్లు వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. పెట్రోల్ బంకులు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌లో ఆన్‌లైన్ చెల్లింపులు సాధ్యపడక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది. డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం బుధవారం రాత్రి 7:50 గంటల వరకు 2,750 ఫిర్యాదులు అందాయి. ఇందులో గూగుల్ పే వినియోగదారుల నుంచి 296 ఫిర్యాదులు నమోదయ్యాయి. ముఖ్యంగా పేమెంట్స్, ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి లావాదేవీల్లో అవాంతరాలు ఎదురైనట్లు యూజర్లు వెల్లడించారు. తమ లావాదేవీలు నిలిచిపోవడంతో వినియోగదారులు సామాజిక మాధ్యమాల్లో సమస్యను హైలైట్ చేశారు.
CM Yogi Plane : సీఎం యోగి విమానంలో సాంకేతిక సమస్య..ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఈ సేవల్లో అంతరాయం కలిగిన కారణాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. అయితే సర్వర్ డౌన్ కావడం లేదా టెక్నికల్ లోపం వల్ల సమస్య ఏర్పడిన అవకాశముందని అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా యూపీఐపై ఆధారపడే కోట్లాది మంది వినియోగదారులకు ఇది తాత్కాలిక ఇబ్బందిని కలిగించింది.