Site icon HashtagU Telugu

2 Beers Free On 1 Phone: ఫోన్ కొంటే 2 బీర్లు ఫ్రీ.. ఎగబడ్డ జనం.. చివరికి ఏమైందో తెలుసా..?

BEERS

Resizeimagesize (1280 X 720) 11zon

ఉత్తరప్రదేశ్‌‌ (Uttar Pradesh)లోని భదోహి జిల్లా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌరీ రోడ్ ఏరియాకు చెందిన రాజేష్ మౌర్య అనే స్మార్ట్‌ఫోన్ స్టోర్ నిర్వాహకుడు హోలీ సందర్భంగా ఇచ్చిన ఆఫర్ ఇది. ఫోన్ సేల్స్‌ పెంచుకోవడానికి ఈ స్ట్రాటజీ అమలు చేయాలని చూశాడు.పాంప్లెట్లు ప్రింట్ చేయించి పంపిణీ చేశాడు. “హోలీ బంపర్ ధమాకా.. ఒక స్మార్ట్ ఫోన్ కొనండి.. రెండు బీర్లు ఉచితంగా పొందండి” అంటూ పోస్టర్లతో ఆఫర్ గురించి ప్రచారం చేయించాడు. తన దుకాణం బయట కూడా పోస్టర్లు పెట్టించాడు. మార్చి 3 నుంచి 7 వరకు మాత్రమే ఈ ఆఫర్‌ పరిమితి ఉంటుందని షరతు విధించాడు.

■ చివరకు జైలుపాలు

రాజేష్ మౌర్య ప్రకటించిన ఆఫర్ విషయం పోలీసుల దృష్టికి వెళ్ళింది. దీంతో వెంటనే అధికారులు కలగజేసుకుని ప్రచారాన్ని అడ్డుకున్నారు. ఇలాంటి ఆఫర్లు ప్రకటించడం చట్ట విరుద్ధం అంటూ రాజేష్ మౌర్యను హెచ్చరించారు. కానీ అప్పటికే అందరికీ ఆఫర్ గురించి తెలిసిపోవడంతో పెద్దఎత్తున కస్టమర్లు తరలి వచ్చారు. రాజేష్ స్టోర్ బయట భారీగా క్యూ లైన్ ఏర్పడింది.ఫలితంగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కస్టమర్లను చెదరగొట్టారు. షాప్ యజమాని రాజేష్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. రాజేష్ ప్రకటించిన ఆఫర్ వల్ల స్మార్ట్ ఫోన్ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. కానీ, చివరికి అతడు జైలు పాలు కావాల్సి వచ్చింది.

Also Read: Viveka : వివేకా హ‌త్య‌కు మ‌రో పెళ్లి లింకు, అవినాష్ కొత్త ట్విస్ట్‌!

■ చట్టవిరుద్ధమైన ఆఫర్ ప్రకటించడంతో

కస్టమర్లను ఆకట్టుకునేందుకు లిక్కర్‌, దాని అనుబంధ ప్రొడక్టులను ఆఫర్ల కింద ప్రకటించకూడదు. ఇది అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) రూపొందించిన కోడ్ ఆఫ్ కండక్ట్‌ని ఉల్లంఘించినట్లే. చట్ట ప్రకారం ఇది నేరం. కేవలం లైసెన్స్ పొందిన యజమానులు మాత్రమే ఈ తరహా ఆఫర్లు ప్రకటించే వీలుంది. దేశంలో 21 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారికి ఆల్కహాల్ విక్రయించడం చట్ట విరుద్ధం. శాంతి భద్రతలకు భంగం కలిగించినందుకు యజమానిని అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ అనిల్ కుమార్ ఆదేశాల ప్రకారం రాజేష్ అరెస్టు అనంతరం దుకాణానికి పోలీసులు సీల్ వేశారు.