Illegal Affair: ఉత్తరప్రదేశ్ హర్దోయ్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. భార్య ప్రవర్తనపై కోపంతో భర్త ఓ ఉన్మాది లా ప్రవర్తించాడు. తన భార్యను ప్రియుడితో కలిసి చూసిన భర్త.. కోపంతో ఆమె ముక్కు కొరికేశాడు. ఈ ఘటన అక్కడ స్థానికంగా భారీ చర్చనీయాంశంగా మారింది.
పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం, హర్దోయ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 25 ఏళ్ల మహిళ.. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది. బుధవారం ఆమె అతడిని కలవడానికి అతని ఇంటికి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త రామ్ ఖిలావన్ ఆమెను రహస్యంగా ఫాలో అయ్యాడు. చివరికి ఆమె ప్రియుడి ఇంట్లో ఉండగా పట్టుకుని, అక్కడే ఘర్షణకు దిగాడు.
తీవ్రంగా వాగ్వాదం జరిగిన తర్వాత.. కోపంతో రామ్ ఖిలావన్, తన భార్య ముక్కు కొరికేశాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన మహిళను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుత పరిస్థితి విషమంగా ఉండడంతో హర్దోయ్ నుంచి లక్నోకి రిఫర్ చేశారు. ఈ ఘటనపై హరియావాన్ పోలీసులు కేసు నమోదు చేసి, భర్తను అరెస్ట్ చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని, బాధిత మహిళకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు.ఈ సంఘటనతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. భార్యాభర్తల మధ్య నమ్మకం దెబ్బతింటే.. ఆ ప్రభావం ఎంత దారుణంగా ఉండొచ్చో ఈ ఘటన చాటి చెబుతోంది.
Honeytrap : 70 ఏళ్ల వృద్ధుడిపై కన్నేసింది..అన్ని చూపిస్తా అంటూ రూ.38.73 లక్షలు దోచేసింది