Site icon HashtagU Telugu

Died From Mid Day Meal: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో విషాదం.. ఫుడ్ పాయిజ‌న్‌తో విద్యార్థిని మృతి, మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మం

Died From Mid Day Meal

Died From Mid Day Meal

Died From Mid Day Meal: ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో ఓ ఆశ్చర్యకరమైన వార్త వెలువడుతోంది. ఆహారం తిని ఓ విద్యార్థిని మృతి (Died From Mid Day Meal) చెందింది. అలాగే పలువురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విద్యార్థినులు ఆస్పత్రిలో చేరారు. అయితే ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. నివేదికలను విశ్వసిస్తే.. ఒక బాలిక‌ పరిస్థితి చాలా విషమంగా ఉంది.

చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది

ఈ కేసు కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్ జలౌన్‌కు సంబంధించినది. పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులకు మధ్యాహ్న భోజనం వడ్డించారు. ఫుడ్ ప్లేట్‌లో పప్పు, అన్నం, పొట్లకాయ, రోటీ, ఓ కూర ఉంది. విద్యార్థులంతా ఉత్సాహంగా భోజనం చేశారు. అయితే తిన్న వెంటనే విద్యార్థినుల పరిస్థితి విషమించడం ప్రారంభించింది. విద్యార్థినులను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒక విద్యార్థిని మృతి చెందింది.

కడుపు నొప్పి వ‌చ్చింది

నివేదికల ప్రకారం.. ఆహారం తిన్న తర్వాత బాలికల‌కు కడుపు నొప్పి మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాల సిబ్బంది కడుపునొప్పికి మందు ఇచ్చారు. మందు తాగిన వెంటనే విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే పాఠశాల సిబ్బంది బాలికల‌ను పిండారి సిహెచ్‌సి ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికలందరినీ ఇక్కడ చేర్చుకున్నారు.

Also Read: Farmers Protest: నేడు ఢిల్లీకి రైతుల పాదయాత్ర.. అడ్డుకునేందుకు పోలీసులు ప‌టిష్ట చ‌ర్య‌లు!

ముగ్గురి ఆరోగ్యం మెరుగుపడింది

ఇద్దరు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఓరాయికి తరలించారు. ఈ సమయంలో మార్గమధ్యంలో ఒక విద్యార్థి మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన ముగ్గురు విద్యార్థినుల పరిస్థితి మెరుగుపడటంతో వారిని డిశ్చార్జి చేశారు.

చనిపోయిన విద్యార్థి ఏడాది క్రితం అడ్మిషన్ తీసుకుంది

పిండారిలోని కస్తూర్బా రెసిడెన్షియల్ స్కూల్‌లో మొత్తం 100 మంది బాలికలు చదువుతున్నారు. వీరిలో 71 మంది బాలికలు పాఠశాలలోనే ఉన్నారు. అందరూ కలిసి భోజ‌నం చేశారు. అయితే 5 మంది విద్యార్థినుల పరిస్థితి బాగా క్షీణించింది. మృతి చెందిన విద్యార్థిని పేరు ఛాయ, 6వ తరగతి చదువుతోంది. భర్సుదా గ్రామానికి చెందిన ఛాయ ఏడాది క్రితమే పాఠశాలలో అడ్మిషన్ తీసుకుంది.