Yogi Adityanath : దసరా సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో నిర్వహించిన శోభాయాత్రలో స్వయంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. చుట్టూ అద్దాలతో ప్రత్యేకంగా రూపొందించిన బగ్గీలో సీఎం యోగి కూర్చున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈసందర్భంగా ముఖ్యమంత్రికి (Yogi Adityanath) భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎవరినీ సీఎం యోగి సమీపంలోకి భద్రతా సిబ్బంది పంపకపోవడం ఆ వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. గోరక్ష్ పీఠాధీశ్వర్ హోదాలో యోగి ఆదిత్యనాథ్ ఈ యాత్రలో పాల్గొన్నారు.
Also Read :Vajramushti Kalaga : రక్తం చిందే దాకా కుస్తీ.. హోరాహోరీగా ‘వజ్రముష్టి కళగ’ పోటీలు
గోరఖ్‌నాథ్ మందిర్ నుంచి ప్రారంభమైన శోభాయాత్రలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ ఊరేగింపు గోరఖ్‌పూర్ నగరంలోని మానసరోవర్ రామ్‌లీలా మైదాన్‌లో ముగియనుంది. అక్కడ శ్రీరాముడిని సీఎం యోగి పూజించి పట్టాభిషేకం చేస్తారు.ఈ ఊరేగింపుకు స్వాగతం పలికిన వారిలో ముస్లిం వర్గం ప్రజలు కూడా ఉండటం గమనార్హం. మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు గోరఖ్‌నాథ్ ఆలయ ప్రధాన ద్వారానికి కొద్ది దూరంలో పూల దండలతో నిలబడి ఊరేగింపుకు ఘన స్వాగతం పలికారు. విజయదశమి శోభాయాత్ర బాకాలు, డప్పులు, బ్యాండ్ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ముందుకు సాగుతోంది. రాంలీలా మైదాన్‌లో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించనున్నారు.
Also Read :DSP Mohammed Siraj: ఇకపై డీఎస్పీ సిరాజ్.. నెట్టింట ఫొటోలు వైరల్, ఎలాంటి సౌకర్యాలు ఉంటాయంటే..?
ఊరేగింపు గోరఖ్‌నాథ్ ఆలయానికి తిరిగి వచ్చిన తరువాత.. ఆలయంలో సంప్రదాయ తిలకోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో సీఎం యోగి తన శిష్యులు, భక్తులను ఆశీర్వదిస్తారు. ఆలయంలో సాంప్రదాయ విందు కార్యక్రమం కూడా ఉంటుంది. ఇందులో అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. విజయదశమి రోజు అనేది గోరక్షపీఠానికి ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇవాళ ఈ పీఠంలో అర్ధరాత్రి గోరక్షపీఠాధీశ్వరుడు న్యాయమూర్తిలా కూర్చొని అందరు సాధువుల సమస్యలను ఓపికగా వింటారు. వాటికి సామరస్యపూర్వక పరిష్కార మార్గాలను చూపిస్తారు.