Site icon HashtagU Telugu

Union Ministers Nephew: తాగునీటి కోసం సోదరుల గొడవ.. కేంద్ర మంత్రి మేనల్లుడి హత్య

Union Minister Nityanand Rais Nephew Murder Jagatpur Bihar Water Tap Issue

Union Ministers Nephew: తాగునీటి విషయమై ఇద్దరు అన్నదమ్ముల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అది కాస్తా రక్తసిక్తం అయింది. పరస్పరం తుపాకులతో కాల్పులు జరుపుకున్నారు. చివరకు వారిలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఇద్దరి గొడవను ఆపేందుకు మధ్యలోకి వచ్చిన వారి తల్లి శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ ఘటన బిహార్‌లోని  భాగల్‌పుర్‌ జిల్లా జగత్‌పుర్ గ్రామంలో చోటుచేసుకుంది. గొడవపడిన ఇద్దరు వ్యక్తులు.. కేంద్ర మంత్రి నిత్యానందరాయ్‌కు స్వయానా మేనళ్లులు అవుతారు.

Also Read :Reddys Lab : రెడ్డీస్‌ ల్యాబ్‌ నుంచి కోట్లు విలువైన మాలిక్యూల్ మాయం

గొడవ ఇలా జరిగింది.. 

కేంద్ర మంత్రి నిత్యానందరాయ్‌ బావ రఘునందన్ యాదవ్‌కు ఇద్దరు కుమారులు. వారి పేర్లు జైజిత్‌ యాదవ్, విశ్వజిత్ యాదవ్‌. వారిలో ఒకరు చనిపోవడంతో బాధిత కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంట్లో పనిచేసే సహాయకుడు నీటిని ఇస్తున్న  సమయంలో.. తన చేతిని గ్లాసులో ముంచాడు. ఇదే విషయంలో అన్నదమ్ములు జైజిత్‌ యాదవ్, విశ్వజిత్ యాదవ్‌(Union Ministers Nephew) గొడవ పడ్డారు. జైజిత్ కాల్పుల్లో విశ్వజిత్ యాదవ్ ప్రాణాలు కోల్పోయాడు. ఎప్పటినుంచో ఈ అన్నదమ్ముల మధ్య సంబంధాలు సరిగ్గా లేవని తెలిసింది. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా నిత్యానంద రాయ్ ఉన్నారు. ఇప్పుడు బిహార్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వమే ఉంది.

Also Read :Maoists Encounter : మరో ఎన్‌కౌంటర్.. 20 మంది మావోయిస్టులు హతం

నిత్యానంద రాయ్ కెరీర్ గ్రాఫ్ 

కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ విషయానికొస్తే..  ఆయన 1966 జనవరి 1న జన్మించారు. వారిది రైతు కుటుంబం. 1981 నుంచే నిత్యానంద రాయ్‌ ఆర్ఎస్ఎస్‌లో పనిచేయడం మొదలుపెట్టారు. ఆయన కులాంతర వివాహం చేసుకున్నారు. బిహార్ యూనివర్సిటీలో నిత్యానంద రాయ్ బీఏ చేశారు.  ఆయన 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉజియార్ పూర్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచారు. అంతకుముందు 2000 సంవత్సరం నుంచి 2010 మధ్యకాలంలో బిహార్‌లోని హాజీపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.