Site icon HashtagU Telugu

Nitin Gadkari faints : సభా వేదికపైనే స్పృహతప్పి పడిపోయిన కేంద్రమంత్రి గడ్కరీ

Gadkari Faints

Gadkari Faints

Nitin Gadkari faints : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తనదైన శైలిలో ప్రసంగాలు చేయడంలో, వ్యాఖ్యలు చేయడంలో దిట్ట. బీజేపీ నాయకుల్లో ఆయన రూటే సెపరేటు. ఒకానొక దశలో దేశ ప్రధాని పదవికి కూడా ఆయన పేరును బీజేపీ అధిష్టానం పరిశీలించిందని అంటారు. తాజాగా బుధవారం రోజు మహారాష్ట్రలోని యావత్మాల్‌ పరిధిలో ఉన్న పూసాద్‌ పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభకు గడ్కరీ(Nitin Gadkari faints) హాజరయ్యారు.

We’re now on WhatsApp. Click to Join

స్థానిక సమస్యల గురించి, స్థానిక నాయకుల గురించి ఆయన చెప్పడం మొదలుపెట్టారు. స్థానికులతో తనకు ఉన్న అనుబంధాన్ని గడ్కరీ గుర్తు చేసుకున్నారు. ఈక్రమంలో అకస్మాత్తుగా ఆయన స్పృహ కోల్పోయారు. వేదికపైనే ఆయన పడిపోబోతుండగా .. వేదికపై కూర్చున్న పార్టీ నాయకులు గమనించారు. వారంతా వెంటనే వచ్చి గడ్కరీని పట్టుకున్నారు. అనంతరం అక్కడి వాహనంలో ఆయనను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులను పిలిపించి చికిత్స చేయించారు. కాసేపట్లో గడ్కరీ ఆరోగ్య స్థితిపై మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Also Read : Pushpa 2 : పుష్ప పుష్ప సాంగ్ ప్రోమో.. రూల్ చేసేందుకు రెడీ..!