Site icon HashtagU Telugu

Madhya Pradesh: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఎన్నికలకు ముందు బీజేపీకి బిగ్ షాక్‌.. సింధియా స‌న్నిహితుడు జంప్‌..

Madhya Pradesh

Madhya Pradesh

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ (Madhya Pradesh) లో అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుంది. మ‌రికొద్ది నెల‌ల్లో ఆ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఈ ద‌ఫా అధికారంలోకి వ‌చ్చేందుకు ప‌ట్టుద‌ల‌తో ఉంది. గ‌త రెండురోజుల క్రితం ప్రియాంక‌ గాంధీ (Priyanka Gandhi) ఆ రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. న‌ర్మ‌దా న‌దికి హార‌తి ఇచ్చారు. అనంత‌రం బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించారు. మ‌రోవైపు బీజేపీ మ‌రోసారి అధికారాన్ని నిల‌బెట్టుకునేందుకు ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం అవుతోంది. అయితే, తాజాగా బీజేపీకి గ‌ట్టిషాక్ త‌గిలింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ బీజేపీ నేత‌, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు స‌న్నిహితుడు, పార్టీ సీనియ‌ర్ నేత జైజ్‌నాథ్ సింగ్ యాద‌వ్‌ బీజేపీకి రాజీనామా చేశాడు. బుధ‌వారం దిగ్విజ‌య్ సింగ్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

గ‌త కొన్ని నెల‌లుగా జ్యోతిరాదిత్య సింధియాకు వ్య‌తిరేకంగా గ‌ళంవిప్పుతూ వ‌చ్చిన బైజ్‌నాథ్ సింగ్ యాద‌వ్ మంగ‌ళ‌వారం బీజేపీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. బుధ‌వారం ఆయ‌న భోపాల్‌లోని మ‌ధ్య‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్యాల‌యానికి భారీ ర్యాలీగా వెళ్లారు. బైజ్‌నాథ్ సింగ్ యాద‌వ్‌ను రాష్ట్ర కాంగ్రెస్ అధ్య‌క్షులు క‌మ‌ల్ నాథ్‌, రాజ్య‌స‌భ ఎంపీ దిగ్విజ‌య్ సింగ్ కాంగ్రెస్ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బైజ్‌నాథ్ యాద‌వ్ 2020లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. అంత‌కుముందు కాంగ్రెస్‌లో జ్యోతిరాదిత్య సింధియాకు మ‌ద్ద‌తుదారుడిగా కొన‌సాగారు. 2020లో జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేర‌డంతో ఆయ‌న‌తో పాటు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా తిరిగి ఆయ‌న కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సంద‌ర్భంగా క‌మ‌ల్‌నాథ్ మాట్లాడుతూ.. బైజ్‌నాథ్ యాద‌వ్ తిరిగి కాంగ్రెస్‌లోకి రావ‌డం సంతోషంగా ఉంద‌ని అన్నారు.

Telangana BJP: బీజేపీ ప్లాన్ – బి షురూ.. అమిత్ షా వ్యూహం స‌క్సెస్ అయితే బీఆర్ఎస్‌కు షాకే!

Exit mobile version