Site icon HashtagU Telugu

One Nation One Election : 16న లోక్‌సభ ఎదుటకు ‘జమిలి’ బిల్లులు.. ఎన్నికలపై కీలక సవరణలివీ

One Nation One Election Bill In Lok Sabha Union Minister Arjun Ram Meghwal 2024 December 16

One Nation One Election :  మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’  బిల్లులు సోమవారం రోజు(డిసెంబరు 16న) లోక్‌సభ ఎదుటకు రానున్నాయి. వీటిని లోక్‌‌సభలో  కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే జమిలి ఎన్నికలతో ముడిపడిన రెండు బిల్లుల కాపీలను ఈ సభలో ప్రవేశపెట్టారు. వాటి పేర్లు.. రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు-2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు -2024. మాజీ రాష్ట్రపతి రా‌మ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని ఉన్నతస్థాయి కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా జమిలి ఎన్నికల నిర్వహణకు సమగ్ర ప్రణాళికను తయారు చేశారు. ఈ వివరాలన్నీ కలిపి మూడు ముసాయిదా బిల్లులను తయారు చేయించారు. వీటిలో.. రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు-2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు -2024లకు గురువారం రోజే (డిసెంబరు 12న) కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.  స్థానిక సంస్థల ఎన్నికలను కూడా జమిలి ఎన్నికల ప్రక్రియలో కలిపే రాజ్యాంగ సవరణ బిల్లును(One Nation One Election) మాత్రం పెండింగ్‌లో ఉంచారు.

Also Read :Forbes Powerful Women List: భార‌త్‌లో ముగ్గురు అత్యంత శ‌క్తివంత‌మైన మ‌హిళ‌లు.. కేంద్ర మంత్రికి కూడా చోటు!

రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు -2024లో ముఖ్యాంశాలివీ.. 

Also Read :30-30-30 Method : 30-30-30 పద్ధతి అంటే ఏమిటి? పొట్ట కొవ్వును తగ్గించడంలో ఎలా సహాయపడుతుంది..!