Nirmala Sitharaman Speech : ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్‌ ప్రసంగాల రికార్డుల చిట్టా

2024లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల 56 నిమిషాలే(Nirmala Sitharaman Speech) ప్రసంగించారు.

Published By: HashtagU Telugu Desk
Union Finance Minister Nirmala Sitharaman Budget Speech

Nirmala Sitharaman Speech : భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రసంగం ఇవాళ కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఆమె ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 1 గంట  17 నిమిషాల పాటు ప్రసంగించారు. గత (2024-25) బడ్జెట్‌ సందర్భంగా నిర్మల 1 గంట 25 నిమిషాలు ప్రసంగించారు. 2003-04లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నాటి ఆర్థికమంత్రి జశ్వంత్‌సింగ్‌ 1 గంట 35 నిమిషాల పాటు ప్రసంగించారు.

Also Read :Women Entrepreneurs : ఫస్ట్ టైం ఎస్సీ, ఎస్టీ మహిళా వ్యాపారవేత్తలకు నిర్మల శుభవార్త

  • 2024లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల 56 నిమిషాలే(Nirmala Sitharaman Speech) ప్రసంగించారు.
  • 2023లో నిర్మల 87 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు.
  • 2022లో నిర్మల 92 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు.
  • 2021లో మొట్టమొదటి కాగిత రహిత బడ్జెట్‌ను నిర్మల ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ఆమె 1 గంట 40 నిమిషాలు ప్రసంగించారు.
  • 2020లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మల  2 గంటల 41 నిమిషాల పాటు ప్రసంగించారు.
  • 2019లో నిర్మల తొలిసారిగా కేంద్ర బడ్జెట్‌ను ప్రసంగించారు. అప్పట్లోఆమె ఏకంగా 2 గంటల 17 నిమిషాలు ప్రసంగించారు.
  • ఎక్కువసార్లు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళామంత్రిగా కూడా నిర్మల సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు.
  • నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది ఎనిమిదోసారి.
  • అత్యధికసార్లు కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన రికార్డు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ పేరిట ఉంది. ఆయన 10 పద్దులను పార్లమెంట్‌కు సమర్పించారు.

Also Read :Tortoise: మీ ఇంట్లో కూడా తాబేలు ఉందా.. అష్టైశ్వర్యాలు కలగడం ఖాయం!

  Last Updated: 01 Feb 2025, 03:28 PM IST