దేశ భద్రతా పరిస్థితుల నేపథ్యంలో కీలకమైన కేంద్ర కేబినెట్ సమావేశం (Union Cabinet Meeting) రేపు (బుధవారం) న్యూఢిల్లీలో జరగనుంది. ఉదయం 11 గంటలకు మొదలయ్యే ఈ భేటీకి ప్రధాని (PM Modi) నేతృత్వంలో మంత్రులంతా హాజరుకానున్నారు. ముఖ్యంగా ఇటీవల నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” అనంతరం జరిగే ఈ తొలి భేటీ కావడంతో భద్రతా రంగంలో తీసుకునే తదుపరి చర్యలపై కేంద్రం దృష్టి సారించే అవకాశముంది.
Operation Sindoor : నేడు పలు దేశాలకు భారత్ ప్రత్యేక బ్రీఫింగ్..!
ఈ సమావేశంలో దేశ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరగనున్నాయి. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)తో సంబంధిత నివేదికలు, విశ్లేషణలు మంత్రివర్గానికి సమర్పించబడే అవకాశం ఉంది. దీనితో పాటు, భవిష్యత్తులో మిలిటరీ వ్యూహాలు, సరిహద్దుల భద్రత, రక్షణ రంగ బలోపేతంపై గణనీయమైన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. సైనిక దళాల సన్నద్ధత, సాంకేతిక సామర్థ్యం పెంపు, హైటెక్ ఆయుధాల కొనుగోలు వంటి అంశాలు కూడా చర్చకు రావచ్చు.
India Vs Kirana Hills: కిరానా హిల్స్‌ను వణికించిన భారత్.. దారికొచ్చిన పాకిస్తాన్
భద్రతా అంశాలకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, ఈ సమావేశంలో ఇతర ముఖ్యమైన ప్రభుత్వ రంగ నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ పాలన, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలు కూడా ఈ కేబినెట్ అజెండాలో ఉండొచ్చని సమాచారం. అయితే మొత్తం సమావేశానికి ప్రధాన ఆకర్షణ భద్రతా వ్యవస్థ పటిష్ఠతే కావడం గమనార్హం.