PM Vidyalaxmi : ‘పీఎం-విద్యాలక్ష్మి’ స్కీంకు లైన్ క్లియర్ అయింది. దీని అమలుకు కేంద్ర మంత్రి మండలి ఇవాళ పచ్చజెండా ఊపింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీ దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఈ స్కీం ద్వారా ఏటా 22 లక్షల మందికిపైగా ప్రతిభావంతులైన విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
Also Read :Formula E Racing : ఫార్ములా-ఈ రేసింగ్ అక్రమాలపై ఏసీబీ విచారణ.. త్వరలో కీలక పరిణామాలు
ఏమిటీ స్కీం ? ఎవరు అర్హులు ?
- పీఎం విద్యాలక్ష్మీ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా 860 విద్యాసంస్థల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుతో రూ.7.50 లక్షల వరకు లోన్లు మంజూరు చేస్తారు. లోన్ అమౌంటులో 75 శాతం మొత్తానికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది.
- రూ.8 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారు ఈ లోన్లు(PM Vidyalaxmi) పొందేందుకు అర్హులు.
- మన దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం అడ్మిషన్లు పొందే వారికి రూ.10 లక్షల దాకా లోన్లను ఈ స్కీం ద్వారా అందిస్తారు.
- రూ.10 లక్షల వరకు లోన్లపై 3 శాతం మేర వడ్డీ రాయితీ కల్పిస్తారు.
- ఏదైనా ఇతర ప్రభుత్వ స్కాలర్‌షిప్ పొందుతున్న వారు ఈ పథకానికి అప్లై చేయడానికి అర్హులు కాదు.
- విద్యార్థులు పీఎం విద్యాలక్ష్మి వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
- పీఎం విద్యాలక్ష్మి స్కీంలో భాగంగా 2024-25 విద్యా సంవత్సరం నుంచి 2030-31 విద్యా సంవత్సరం వరకు లోన్లను మంజూరు చేయడానికి కేంద్ర సర్కారు రూ.3,600 కోట్లను కేటాయించింది.
Also Read :Corn Polymer : ప్లాస్టిక్‌కు నై.. కార్న్ పాలిమర్‌కు జై.. పెరుగుతున్న వినియోగం
- ఏటా లక్ష మంది విద్యార్థులకు ఈ-ఓచర్లను కూడా ఈ స్కీంలో భాగంగా పంపిణీ చేస్తారు.
- 101 నుంచి 200 వరకు జాతీయ స్థాయి ర్యాంకింగ్ కలిగిన రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థలతో పాటు అన్ని కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలలో చదివే విద్యార్థులు ఈ లోన్లకు అప్లై చేయడానికి అర్హులే.