కేంద్ర సర్కార్ (Union Cabinet) రైతులకు తీపి కబురు తెలిపింది. ఖరీఫ్‌లో 14 రకాల పంటలకు ( 14 Kharif season crops) మద్దతు ధర పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్రమంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. వరికి మద్దతు ధరను రూ.117 పెంచింది. దీంతో వరి ధాన్యం క్వింటాలు ధర రూ.2,300కు చేరింది. అలాగే రాగి, బజ్రా, జొన్న, మొక్కజొన్న , పత్తితో సహా మొత్తం 14 ఖరీఫ్ సీజన్ పంటలపై కనీస మద్దతు ధర పెంచేందుకు మోదీ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. పెంచిన ధరలను ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
పెరిగిన ధరలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. పంట ఉత్పత్తి ధరకు పెంచిన ఎమ్మెస్పీ కనీసం 1.5శాతంగా ఉన్నట్లు చెప్పారు. దీంతో పాటు గుజరాత్, తమిళనాడులో మొత్తం 7వేల 453 కోట్లతో ఒక గిగావాట్ ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మహారాష్ట్రలోని వధావన్‌లో గ్రీన్‌ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ పోర్ట్‌ను 76వేల కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇక జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా శ్రీనగర్‌లోని దాల్ సరస్సు సమీపంలోని షేర్ ఐ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ వేదికగా జరిగే యోగా కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొనబోతున్నారు. ఆ రోజు ఉదయం 6.30 గంటలకు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపు 7 వేల మందితో కలిసి ప్రధాని మోదీ యోగా చేయనున్నారు.
Read Also : IAS Transfers in AP : ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..