Site icon HashtagU Telugu

Indias Aid 2025 : కేంద్ర బడ్జెట్‌.. భారత్‌ ఆర్థికసాయం పొందనున్న దేశాలివే

Indias Aid 2025 Indias Budget 2025 Union Budget 2025

Indias Aid 2025 : ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో మన దేశం ద్రవ్యలోటును చూపించింది. ద్రవ్యలోటు అంటే నిధుల లేమి. అయినప్పటికీ మిత్ర దేశాలకు భారత ప్రభుత్వం నిధుల కేటాయింపును ఆపలేదు.  ‘నైబర్‌హుడ్ ఫస్ట్’  అనేది భారతదేశ విదేశాంగ శాఖ నినాదం. ఈ నినాదానికి జీవం పోస్తూ పలు మిత్రదేశాలకు భారత్ నిధులను కేటాయించింది.  ఆ జాబితాను చూద్దాం..

Also Read :Bihar Budget 2025: ఎన్నికల ఏడాది ఎఫెక్ట్.. బడ్జెట్‌లో బిహార్‌పై వరాల జల్లు

భూటాన్‌

ఈ ఏడాది (2025-26) కేంద్ర బడ్జెట్‌లో భూటాన్‌కు భారత్ రూ. 2,150 కోట్లను ఆర్థిక సాయంగా(Indias Aid 2025) కేటాయించింది. మన దేశం నుంచి ఈసారి అత్యధిక ఆర్థిక సాయాన్ని అందుకోనున్నది ఈ దేశమే. గతేడాది భూటాన్‌కు భారత్ రూ.2,068 కోట్లను కేటాయించింది. ఈ నిధులను భూటాన్‌లో మౌలిక సదుపాయాలు, జలవిద్యుత్ ప్రాజెక్టుల డెవలప్‌మెంట్ కోసం వినియోగిస్తారు.

మాల్దీవులు

మాల్దీవులకు గత సంవత్సరం భారత్ రూ.400 కోట్లు ఇచ్చింది. ఈసారి అత్యధికంగా రూ.600 కోట్లను ఆ దేశానికి కేటాయించింది. మాల్దీవుల ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జు అధికార పగ్గాలు చేపట్టిన కొత్తలో భారత్‌కు వ్యతిరేకంగా స్వరం వినిపించారు. తర్వాత సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆయన స్వరం మారింది. తమకు భారత్ సాయం అవసరమని ముయిజ్జు ప్రకటించారు. ఈనేపథ్యంలో భారత్ ఆ దేశానికి కేటాయింపులను పెంచింది.  ఈనిధులతో మాల్దీవుల్లో వివిధ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులను అమలు చేస్తారు.

Also Read :Street Vendors : వీధి వ్యాపారులకు శుభవార్త.. రూ.30వేలతో యూపీఐ క్రెడిట్ కార్డులు

ఆఫ్ఘనిస్తాన్

మరో మిత్రదేశం ఆఫ్ఘనిస్తాన్‌కు కూడా భారత్ నిధులు ఇచ్చింది.  గత ఏడాది రూ. 207 కోట్లు ఇవ్వగా, ఈసారి కేవలం రూ. 100 కోట్లను మాత్రమే ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్ కేటాయించింది. మానవతా సహాయం, పలు డెవలప్‌మెంట్ పనుల కోసం ఈ నిధులను వెచ్చిస్తారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వంతోనూ భారత్ మంచి సంబంధాలే నెరుపుతోంది.

మయన్మార్

మయన్మార్‌లో ప్రస్తుతం సైనిక పాలన నడుస్తోంది. అయినా ఆ దేశానికి భారత్ ఆర్థిక సాయాన్ని కంటిన్యూ చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో మయన్మార్‌కు భారత్ రూ. 250 కోట్లను కేటాయించింది. ఈసారి ఆ దేశానికి ఏకంగా రూ. 350 కోట్లను కేటాయించింది.భారతదేశ ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్లో మయన్మార్ ఉంది. అందుకే దానితో మంచి సంబంధాలు నెరపడం భారత్‌కు చాలా ముఖ్యం.

నేపాల్

నేపాల్‌కు భారత్ ఈసారి రూ.700 కోట్లను కేటాయించింది.

శ్రీలంక

శ్రీలంకకు భారత్ ఈసారి రూ.300 కోట్లు కేటాయించింది.

బంగ్లాదేశ్

బంగ్లాదేశ్‌కు ఈసారి భారత్ రూ.120 కోట్లు కేటాయించింది.