Maharajah Duleep Singh : సిక్కు సామ్రాజ్యం చివరి పాలకుడు మహారాజా దులీప్ సింగ్. ఆయన రెండో కుమారుడి పేరు ప్రిన్స్ ఫ్రెడరిక్ దులీప్ సింగ్. ప్రిన్స్ ఫ్రెడరిక్ దులీప్ సింగ్ 1924లో తన తండ్రికి సంబంధించిన గుర్తులతో నార్ఫోక్ కౌంటీ పరిధిలోని థెట్‌ఫోర్డ్‌లో మ్యూజియంను ఏర్పాటుచేశారు. తాజాగా ఈ మ్యూజియం నిర్వహణకు నేషనల్ లాటరీ హెరిటేజ్ ఫండ్ దాదాపు రూ.2 కోట్లను మంజూరు చేసింది. ఈ మ్యూజియం ప్రస్తుతం 100వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా విరాళాన్ని ఇచ్చామని నేషనల్ లాటరీ హెరిటేజ్ ఫండ్ వెల్లడించింది. మహారాజా దులీప్ సింగ్ కుటుంబం ఆనాడు వాడిన వస్తువులను ప్రదర్శించేందుకు, ఆ ఫ్యామిలీ చరిత్రను అద్దంపట్టే అవశేషాలను ఒకచోటకు చేర్చడానికి ఈ నిధులను వాడుతారు. దులీప్ సింగ్(Maharajah Duleep Singh) కుటుంబం చారిత్రక విశేషాలకు నెలవైన ఈ మ్యూజియంలో ఆంగ్లో-పంజాబ్ హిస్టరీ గురించి పూర్తి వివరణ ఉంటుంది. గతంలో వేల్స్ యువరాజుగా వ్యవహరించిన కింగ్ ఎడ్వర్డ్ VII .. దులీప్ సింగ్ వాకింగ్ స్టిక్ సహా పలు కుటుంబ వస్తువులను ఈ మ్యూజియానికి అందించడం విశేషం.
We’re now on WhatsApp. Click to Join.
మహారాజా దులీప్ సింగ్ ఎవరు ?
- 1799 సంవత్సరంలో పంజాబ్‌లో సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించిన మహారాజా రంజిత్ సింగ్ చిన్న కుమారుడే ఈ మహారాజా దులీప్ సింగ్.
- బ్రిటీష్ వాళ్లతో జరిగిన యుద్ధంలో తన తండ్రి, పెద్ద సోదరుడు మరణించిన తరువాత.. ఐదు సంవత్సరాల వయస్సులో దులీప్ సింగ్ పంజాబ్ రాజ్యానికి రాజు అయ్యాడు. 1849లో బ్రిటీష్ పాలకులు పంజాబ్‌ను స్వాధీనం చేసుకొని దులీప్ సింగ్‌ను సింహాసనం నుంచి తొలగించారు.
- ఎంతో అందంగా ఉన్న బాలుడు దులీప్ సింగ్‌ను 15 సంవత్సరాల వయస్సులో బ్రిటీష్ వాళ్లు ఇంగ్లాండ్‌కు తీసుకెళ్లారు. అతడు పెరిగి పెద్దవాడయ్యాక .. బ్రిటీష్ రాజ కుటుంబం అందించిన సఫోల్క్ ప్రాంతంలోని ఎల్వెడెన్ హాల్ అనే రాజమందిరంలో నివసించాడు.
Also Read : Kasuri Methi : కసూరి మేతి.. కొలెస్ట్రాల్, అపానవాయువు ప్రాబ్లమ్స్‌కు చెక్
- బ్రిటీష్ రాజ కుటుంబానికి చెందిన ఒక మహిళను దులీప్ సింగ్ పెళ్లి చేసుకున్నాడు.
- మహారాజా దులీప్ సింగ్ కుటుంబం శతాబ్దం పాటు ఎల్వెడెన్ హాల్ రాజమందిరంలోనే నివసించింది.
- మొదటి ప్రపంచ యుద్ధం టైంలో మహారాజా దులీప్ సింగ్ కుమారుడు ప్రిన్స్ ఫ్రెడరిక్ దులీప్ సింగ్ ‘నార్ఫోక్ యోమన్రీ’ అనే బ్రిటన్ సైనిక విభాగానికి సారథ్యం వహించాడు.