Site icon HashtagU Telugu

Delhi liquor scam case : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో ఇద్దరికి బెయిల్‌

Delhi High Court

Delhi High Court

Delhi liquor scam case: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ప్రముఖ ఢిల్లీ వ్యాపారవేత్త సమీర్ మహేంద్ర, ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్ చన్‌ప్రీత్ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కవిత, విజయ్ నాయర్ కూడా ఇదే కేసులో బెయిల్‌పై బయటకు వచ్చారు. అనంతరం.. ఈ ఇద్దరికీ బెయిల్ మంజూరైంది.

Read Also: MLA Defection Case: హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్‌కు చెంపపెట్టు: బీఆర్ఎస్

నిందితులిద్దరూ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తీర్పును జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ వెలువరించారు. ‘వీరికి బెయిల్ మంజూరు చేయబడింది. 2021-22కిగానూ రూపొందించిన కొత్త మద్యం పాలసీలో తప్పుడు మార్పులు చేయడం ద్వారా వ్యాపారులకు మరిన్ని ప్రయోజనాలు కల్పించి.. వారి నుంచి లంచాలు తీసుకున్నారని సీబీఐ, ఈడీ పేర్కొన్నాయి. ఢిల్లీ ప్రభుత్వం 2021 నవంబర్ 17న ఈ విధానాన్ని అమలు చేసింది. అవినీతి ఆరోపణలతో సెప్టెంబర్ 2022లో దానిని ఉపసంహరించుకుంది.’ అని తెలిపారు.

ఈ ఏడాది ఏప్రిల్ 12న చన్‌ప్రీత్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో చన్‌ప్రీత్ ఆమ్ ఆద్మీ పార్టీ క్యాష్ ఫండ్స్‌ని మేనేజ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా, సమీర్ మహేంద్రుడిని 2022 సెప్టెంబర్ 28న అరెస్టు చేశారు. సౌత్ గ్రూప్.. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు లంచం ఇచ్చిందని ఈడీ ఆరోపించింది. ఈ లంచం మొత్తంలో రూ.45 కోట్లను గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో వినియోగించినట్లు ఈడీ పేర్కొంది.

Read Also: BiggBoss 8 : నాగార్జున కన్నా మూడు రెట్లు ఎక్కువ..!