DGP Brothers : ఇద్దరు అన్నదమ్ములు ఐపీఎస్ ఆఫీసర్లు అయిన పలు కేస్ స్టడీలు ఉన్నాయి. కానీ తొలిసారిగా అన్నదమ్ములు ఒకే టైంలో డీజీపీలుగా పోస్టింగ్ పొందారు. సోదరులు వివేక్ సహాయ్, వికాస్ సహాయ్ ఇద్దరూ రెండు రాష్ట్రాలకు డీజీపీలు అయ్యారు. గతేడాది కాలంగా గుజరాత్ రాష్ట్రానికి డీజీపీగా వికాస్ సహాయ్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఆయన సోదరుడు వివేక్ సహాయ్‌కు కీలక అవకాశం దక్కింది. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు బెంగాల్ డీజీపీ పదవి వివేక్‌ను వరించింది. సోమవారమే డీజీపీగా వివేక్ బాధత్యలు చేపట్టారు. ఈ డీజీపీ బ్రదర్స్ కెరీర్ విశేషాలను ఓసారి చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join
వివేక్ సహాయ్ ట్రాక్ రికార్డు
- వివేక్ సహాయ్, వికాస్ సహాయ్ బిహార్ వాస్తవ్యులు.
- బిహార్‌కు చెందిన సహాయ్ కుటుంబంలో మొత్తం ముగ్గురు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించారు.
- వివేక్ సహాయ్ 1988 బ్యాచ్, వికాస్ సహాయ్ 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు. ఇక వీరి మరో సోదరుడు విక్రమ్ సహాయ్ 1992 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి.
- వివేక్ సహాయ్ బెంగాల్ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.
- గతంలో బెంగాల్‌లో డీజీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హోం గార్డ్‌గా వివేక్(DGP Brothers) పనిచేశారు.
- 2021లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సెక్యూరిటీకి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. వివేక్ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌గా విఫలమయ్యాడని ఆ సంవత్సరమే ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది.
- మళ్లీ 2023లో డీజీగా వివేక్‌కు బాధ్యతలు అప్పగించారు.
- బెంగాల్ డీజీపీ పదవికి ముగ్గురి పేర్లను ఎన్నికల సంఘానికి పంపారు. వారిలో వివేక్ సహాయ్ను డీజీపీగా ఎన్నికల సంఘం ఎంపిక చేసింది.
- సోమవారం రోజు బెంగాల్ డీజీపీగా వివేక్ సహాయ్ నియమితులయ్యారు.
- వివేక్ సహాయ్ ఈ ఏడాదిలోనే పదవి విరమణ చేయనున్నారు.
Also Read : Telangana Governor : తెలంగాణకు కొత్త గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్
వికాస్ సహాయ్ ట్రాక్ రికార్డు
- వికాస్ సహాయ్ 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.
- 1999లో గుజరాత్ ఆనంద్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.
- 2001లో అహ్మదాబాద్‌లో రూరల్‌లో ఎస్పీగా పనిచేశారు.
- 2002లో జరిగిన గోద్రా అల్లర్ల ఘటనలో ఆయన గాయపడ్డారు.
- 2002లో అహ్మదాబాద్‌లోనే జోన్ 2,3కి డీసీపీగా నియమితులయ్యారు.
- 2004లో ట్రాఫిక్ డీసీపీ, 2005లో అదనపు ట్రాఫిక్ సీపీ (అహ్మదాబాద్). 2007లో అదనపు సీపీ (సూరత్)గా నియమితులయ్యారు.
- 2008లో జాయింట్ సీపీ(సూరత్)గా, 2009లో ఐజీ (సెక్యూరిటీ), 2010లో ఐజీ (సీఐడీ)గా పనిచేశారు.
- 2023లో గుజరాత్‌కు డీజీపీగా నిమమితులయ్యారు.
- గతేడాది కాలంగా గుజరాత్ రాష్ట్రానికి డీజీపీగా వికాస్ సహాయ్ వ్యవహరిస్తున్నారు.