Suhaildev Express Train : మరో రైలు ప్రమాదం..ఈసారి ఎక్కడంటే

ప్రయాగ్​రాజ్​ రైల్వే స్టేషన్​ సమీపంలో సుహైల్‌దేవ్​ సూపర్​ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ హాని జరగకపోవడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు

Published By: HashtagU Telugu Desk
Suhaildev Express Train Der

Suhaildev Express Train Der

దేశ వ్యాప్తంగా వరుస రైలు ప్రమాదాలు (Train Accidents) ఆందోళలనలు కలిగిస్తున్నాయి. రైలు ఎక్కాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. టెక్నాలజీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నప్పటికీ..రైల్వే శాఖ మాత్రం రైలు ప్రమాదాలను అరికట్టలేకపోతుంది. ముఖ్యంగా సిగ్నల్ లోపల వల్ల తరుచు ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్నటి మొన్న విజయనగరం (Vijayanagaram Train Accindet) జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన లో దాదాపు 15 మంది వరకు చనిపోగా..ఇంకా కొంతమంది చావుతో పోరాడుతున్నారు. అలాగే పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటన గురించి ఇంకా ప్రజలు మాట్లాడుతుండగానే మరో ప్రమాద వార్త వెలుగులోకి వచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​ రైల్వే స్టేషన్​ సమీపంలో సుహైల్‌దేవ్​ సూపర్​ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (Suhaildev Express ) రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ హాని జరగకపోవడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఘాజీపుర్​ నుంచి దిల్లీలోని ఆనంద్​ విహార్ టెర్మినల్​​కు వెళ్తున్న సుహైల్‌దేవ్​ సూపర్​ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్​ సహా మరో రెండు కోచ్​లు (Two coaches, engine of derail) పట్టాలు తప్పాయి. ఈ ఘటన గురించి విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. రైల్వే ట్రాక్​ పునరుద్ధరణ పనులు చేపట్టడంతో.. మిగతా రైళ్ల రాకపోకలు​ సాధారణంగానే జరుగుతున్నాయని ఉత్తర మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు. గ్రీన్ సిగ్నల్​ ఇచ్చిన వెంటనే రైలు ప్రయాగ్​రాజ్​ స్టేషన్​ నుంచి బయలుదేరిందని.. ఆ సమయంలోనే ప్లాట్​పామ్​ నెంబర్​ 6 వద్ద ఈ ఘటన జరిగిందని వెల్లడించారు.

Read Also : Vivek Venkataswamy : బీజేపీకి వివేక్ రాజీనామా..కాసేపట్లో రాహుల్ తో భేటీ

  Last Updated: 01 Nov 2023, 12:35 PM IST