Amit Shah : పసుపు రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీకి కట్టుబడి, దేశంలోనే ప్రథమ జాతీయ పసుపు బోర్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పసుపు ఉత్పత్తుల ప్రదర్శనను పరిశీలించి, ఇందూర్ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. అమిత్ షా మాట్లాడుతూ.. “ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. పసుపు బోర్డు ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మోడీ సర్కారు పట్ల రైతులు ఉంచిన నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం,” అన్నారు.
పసుపు రైతుల పోరాటాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని ఆయన పేర్కొన్నారు. పసుపు బోర్డు ద్వారా నేరుగా ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ , ఎగుమతుల కార్యక్రమాలను ప్రోత్సహించనుంది. నిజామాబాద్ పసుపును ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. “ఇక్కడి పసుపుకు జియో ట్యాగింగ్ చేస్తాం. 2030 నాటికి 1 మిలియన్ డాలర్ల ఎగుమతుల ప్రణాళికను సిద్ధం చేశాం,” అని అమిత్ షా వెల్లడించారు. పసుపు అంటే నాన్-బయోటిక్, ఔషధ గుణాలు కలిగిన సంపద అని పేర్కొన్న అమిత్ షా, రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
“2025లో పసుపుకు రూ.19 వేల ధర వచ్చిందని గమనించాలి. రానున్న 3 ఏళ్లలో పసుపు ధర రూ.6,000 నుండి రూ.7,000 పెరగనుంది,” అని పేర్కొన్నారు. అంతేకాకుండా భారత కోఆపరేటివ్ బ్రాంచ్, భారత్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ బ్రాంచ్‌లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ బోర్డు ఏర్పాటుతో పసుపు ఉత్పత్తులు పెరిగే అవకాశముందని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Sperm DNA Damage : దెబ్బతింటున్న పురుషుల వీర్యకణాల డీఎన్ఏ.. సంచలన నిజాలు వెలుగులోకి!