South Central Railway : టికెట్ లేని ప్రయాణం.. రూ. కోటి ఫైన్ వసూలు

South Central Railway : సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) పరిధిలో టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై అధికారులు విస్తృత స్థాయిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీ సంఖ్యలో నిబంధనలు ఉల్లంఘించిన ప్రయాణికులు దొరికారు. మొత్తం 16 వేల మంది టికెట్ లేకుండా

Published By: HashtagU Telugu Desk
Alert for train passengers... Key changes for passenger trains..!

Alert for train passengers... Key changes for passenger trains..!

సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) పరిధిలో టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై అధికారులు విస్తృత స్థాయిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీ సంఖ్యలో నిబంధనలు ఉల్లంఘించిన ప్రయాణికులు దొరికారు. మొత్తం 16 వేల మంది టికెట్ లేకుండా, తప్పు టికెట్లతో లేదా తక్కువ దూరానికి టికెట్లు కొనుగోలు చేసి ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. ఈ చర్యల ఫలితంగా రైల్వే చరిత్రలోనే తొలిసారి ఒకే రోజు రూ. 1.08 కోట్లు ఫైన్ రూపంలో వసూలు చేశారు. సాధారణంగా రోజువారీ ఫైన్ సేకరణ సగటు రూ. 40–50 లక్షల మధ్య ఉండగా, ఈసారి అది రికార్డు స్థాయికి చేరింది.

‎Cool Drinks: మీకు కూడా కూల్ డ్రింక్స్ అంటే ఇష్టమా.. ఇది తెలిస్తే జీవితంలో మళ్లీ వాటి జోలికి వెళ్ళరు!

జోన్ వారీగా పరిశీలిస్తే.. విజయవాడ డివిజన్ రూ. 36.91 లక్షలతో అగ్రస్థానంలో నిలిచింది. దాని తరువాత గుంతకల్లు డివిజన్ రూ. 28 లక్షలు, సెకుంద్రాబాద్ డివిజన్ రూ. 27.9 లక్షలు, గుంటూరు డివిజన్ రూ. 6.46 లక్షలు, హైదరాబాద్ డివిజన్ రూ. 4.6 లక్షలు, మరియు నాందేడ్ డివిజన్ రూ. 4.08 లక్షలు వసూలు చేశాయి. ఈ తనిఖీల్లో రైల్వే టికెట్ చెకింగ్ సిబ్బంది, RPF బలగాలు సమన్వయంతో పాల్గొని ప్రతీ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల వివరాలు పరిశీలించారు. అనుమానాస్పద ప్రయాణికుల వద్ద నుంచి టికెట్లు పరిశీలించి, ఉల్లంఘనలను రికార్డు చేశారు.

SCR అధికారులు ఈ సందర్భంగా టికెట్ లేకుండా ప్రయాణించడం రైల్వే చట్టం ప్రకారం నేరమని స్పష్టం చేశారు. ఫైన్ తో పాటు జైలు శిక్షకు గురయ్యే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. ప్రజలు చట్టాలను పాటించి, రైల్వే సేవలను సక్రమంగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, ఈ ప్రత్యేక తనిఖీలు ఇకపై కూడా నిరంతరంగా కొనసాగుతాయని, టికెట్ లేని ప్రయాణాన్ని అరికట్టడమే లక్ష్యమని తెలిపారు. రైల్వే ఆదాయం పెరగడంతో పాటు ప్రజల్లో క్రమశిక్షణ పెంపొందించడంలో ఈ చర్యలు సహాయపడతాయని అధికారులు పేర్కొన్నారు.

  Last Updated: 15 Oct 2025, 08:28 AM IST