Site icon HashtagU Telugu

Train On Platform : ప్లాట్ ఫామ్ పైకి దూసుకొచ్చిన రైలు.. ఏం జరిగిందంటే ?

Train On Platform

Train On Platform

Train On Platform : ఆ ట్రైన్ కు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో దానిపై డ్రైవర్ కంట్రోల్ కోల్పోయాడు. ఆ ట్రైన్ ఏకంగా ప్లాట్​ఫాంపైకి దూసుకొచ్చింది. దీంతో అక్కడ ప్లాట్ ఫామ్ పై ఉన్న ప్రయాణికులు  హడలెత్తారు. ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. లక్కీగా ట్రైన్ కు బ్రేకులు పడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఉత్తర​ప్రదేశ్​లోని మథుర రైల్వేస్టేషన్​లో జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఒక ప్యాసింజర్​ రైలు శుకర్​ బస్తీ స్టేషన్​ నుంచి మంగళవారం రాత్రి 10.49 గంటలకు మథుర రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ప్రయాణికులంతా ఆ రైలు నుంచి దిగి వెళ్లిపోయారు. అనంతరం బ్రేకులు ఫెయిలై రెండో నంబర్​ ప్లాట్​ఫాంపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ప్లాట్​ఫాంపై ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన వల్ల పలు రైళ్ల రాకపోకలకు ఆలస్యమయ్యాయని అధికారులు (Train On Platform) చెప్పారు.

Also read : High BP – 18 Crore Indians : ‘సైలెంట్ కిల్లర్’ గుప్పిట్లో 18 కోట్ల మంది ఇండియన్స్ : డబ్ల్యూహెచ్ఓ