Site icon HashtagU Telugu

Train Accident History in India : భారత్ లో జరిగిన అత్యంత ఘోర రైలు ప్రమాదాలు ఇవే..

Train Accident History In India

Train Accident History In India

ప్రస్తుతం రైలు (Train) ఎక్కాలంటే ప్రయాణికులు వణికిపోతున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట రైలు ప్రమాద (Train Accidents) ఘటన చోటుచేసుకుంటూనే ఉంది. టెక్నలాజి లో భారత్ (India) దూసుకుపోతున్న..రైలు ప్రమాదాలను అరికట్టడంలో మాత్రం విఫలం అవుతుంది. వందేభారత్ (Vande Bharat Train) లాంటి రైళ్లను తీసుకరావడం కాదు ఉన్న రైళ్లు ప్రమాదానికి గురి కాకుండాచూసుకోవాల్సిన బాధ్యత రైల్వే శాఖా ఫై ఉంది.

తాజాగా ఏపీలోని విజయనగరం (Vijayawada Train Accident ) జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సిగ్నల్ కోసం ఆగి ఉన్న ట్రైన్ ను..వెనుక నుండి మరో ట్రైన్ వచ్చి ఢీ కొట్టిందంటే అది సిగ్నల్ లోపమా..? లేక మానవ తప్పిదమా..? దీనికి బాద్యులు ఎవరు..? అనే ప్రశ్నలు లేవనెత్తున్నాయి. ఎవరో చేసిన తప్పుకు అమాయకపు ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఈ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు,,? ఈ కుటుంబాలను ఎవరు కాపాడతారు.? ఇవే ఇప్పుడు అందరు ప్రశ్నిస్తున్నారు. ఒక్క ఏపీలోనే కాదు దేశ వ్యాప్తంగా ఎన్నో రైలు ప్రమాద ఘటనలు జరిగి వేలాది మంది ప్రాణాలను బలితీసాయి. ఇప్పటివరకు జరిగిన అతి భారీ రైలు ప్రమాద ఘటనలను (Train Accident History in India) ఓ సారి తెలుసుకుందాం.

* 1964 డిసెంబర్ 23: తుఫాను కారణంగా పాంబన్ -ధనుస్కోడి ప్యాసింజర్ రైలు రామేశ్వరం వద్ద వరదలో కొట్టుకుపోయింది. 126 మంది ప్రయాణికులు మరణించారు.

* 1981లో బీహార్‌లో : రైలు అదుపుతప్పి బాగమతి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 800 మంది ప్రయాణికులు చనిపోయారు. భారత దేశ చరిత్రలో ఒకే ప్రమాదంలో ఇంతమంది చనిపోవడం ఇదే మొదటిసారి.

* 1988 జూలై 8: కేరళలోని అష్టముడి సరస్సుపై ఉన్న పెరుమాన్ వంతెనపై రైలు పట్టాలు తప్పింది. బోగీలు నీటిలో పడటంతో 105 మంది మరణించారు. ట్రాక్ అలైన్‌మెంట్, మానవ తప్పిదాలే ఈ విషాదానికి కారణమని ఆ తర్వాత తేలింది.

* 1995లో పురుషోత్తం : ఎక్స్‌ప్రెస్ ఫిరోజాబాద్ సమీపంలో కాళింది ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో 300-400 మంది మరణించారు.

* 1998 నవంబర్ 16: పంజాబ్‌లోని ఖన్నాలోని ఫ్రాంటియర్ గోల్డెన్ టెంపుల్ మెయిల్ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పాయి. అటుగా వచ్చిన జమ్మూ తావి – సీల్దా ఎక్స్‌ప్రెస్ రైలు ఆ బోగీలను ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 212 మంది మరణించారు.

* 1999 ఆగస్ట్ 2: నార్త్ ఫ్రాంటియర్ రైల్వేలోని కతిహార్ డివిజన్‌లోని గైసల్ స్టేషన్‌లో ఆగి ఉన్న అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్‌ రైలును బ్రహ్మపుత్ర రైలు ఢీకొట్టింది. బోగీలు ఒకదానిపైకి మరొకటి ఎక్కాయి. ఈ ప్రమాదంలో 285 మందికి పైగా మరణించగా.. 300 మంది గాయపడ్డారు. బాధితుల్లో ఎక్కువ మంది ఆర్మీ, BSF, CRPF జవాన్లు ఉన్నారు.

* 2002 సెప్టెంబరు 9: బీహార్‌లోని రఫీగంజ్‌లో ధావే నదిపై ఉన్న వంతెనపై హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు బోగీలు ధ్వంసమయ్యాయి. నాటి ఘటనలో 140 మందికి పైగా మరణించారు. ఉగ్రవాదులు కుట్రపూరితంగా పట్టాలను ధ్వంసం చేయడం ఈ ప్రమాదం జరిగిందని నాడు ఆరోపణలు వచ్చాయి.

* గోల్కొండ రైలు ప్రమాదం (2003 జూలై 2): గుంటూరు నుంచి సికింద్రాబాద్ వస్తున్న గోల్కోండ ఎక్స్‌ప్రెస్ రైలు వరంగల్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వద్ద పట్టాలు తప్పి, ఇంజిన్, రెండు బోగీలు కిందపడ్డాయి. బ్రిడ్జి కింద ఉన్న కార్లు, బైకులు, పలు వాహనాలు రైలు కింద నలిగిపోయాయి. నాటి ప్రమాదంలో అధికారికంగా 22 మంది మృతి చెందారని చెప్పినా.. అంతకు ఎక్కువే మరణించారని కొన్ని వార్తా కథనాల్లో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో 110 మంది గాయపడ్డారు. వరంగల్ రైల్వే స్టేషన్‌లో ఆగాల్సిన రైలు లూప్ లైన్‌లోకి వెళ్లే సమయంలో వేగం తగ్గాల్సి ఉన్నా.. బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

* 7 జూలై 2011న : ఉత్తరప్రదేశ్ లోని ఎటా జిల్లా సమీపంలో చాప్రా-మథుర ఎక్స్ ప్రెస్ బస్సును ఢీకొట్టింది. 69 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

* 2012  : భారతీయ రైల్వే చరిత్రలో రైలు ప్రమాదాల పరంగా అత్యంత ఘోరమైన సంవత్సరంగా నిలిచింది. పట్టాలు తప్పడం, ఎదురెదురుగా రైళ్లు ఢీకొనడంతో కలిపి ఈ ఏడాది 14 ప్రమాదాలు జరిగాయి.

* 30 జూలై 2012 న : నెల్లూరు సమీపంలో ఢిల్లీ-చెన్నై తమిళనాడు ఎక్స్ ప్రెస్ బోగీలో మంటలు చెలరేగి 30 మందికి పైగా మరణించారు. వంద‌ల మంది గాయ‌ప‌డ్డారు.

* 26 మే 2014న : ఉత్తరప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ ప్రాంతంలో గోరఖ్ పూర్ వైపు వెళ్తున్న గోరఖ్ ధామ్ ఎక్స్ ప్రెస్ ఖలీలాబాద్ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొనడంతో 25 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు.

* 20 మార్చి 2015న  : డెహ్రాడూన్ నుంచి వారణాసి వెళ్తున్న జనతా ఎక్స్ ప్రెస్ లో పెను ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలోని బచ్రవాన్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఇంజిన్, పక్కనే ఉన్న రెండు బోగీలు పట్టాలు తప్పడంతో 30 మందికి పైగా మృతి చెందగా, 150 మందికి పైగా గాయపడ్డారు.

* 20 నవంబర్ 2016న  :ఇండోర్-పాట్నా ఎక్స్ ప్రెస్ కాన్పూర్ లోని పుఖ్రాయన్ సమీపంలో పట్టాలు తప్పడంతో 150 మంది ప్రయాణికులు మృతి చెందగా, 150 మందికి పైగా గాయపడ్డారు.

* 19 ఆగస్టు 2017న :  హరిద్వార్-పూరీ మధ్య నడిచే కళింగ ఉత్కల్ ఎక్స్ ప్రెస్ ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ న‌గ‌ర్ లోని ఖతౌలి సమీపంలో ప్రమాదానికి గురైంది. రైలులోని 14 బోగీలు పట్టాలు తప్పడంతో 21 మంది ప్రయాణికులు మృతి చెందగా, 97 మంది గాయపడ్డారు.

* ఆగస్టు 23, 2017న : ఢిల్లీ వెళ్తున్న కైఫియత్ ఎక్స్ ప్రెస్ కు చెందిన తొమ్మిది రైలు బోగీలు ఉత్తరప్రదేశ్ లోని ఔరయా సమీపంలో పట్టాలు తప్పడంతో 70 మంది గాయపడ్డారు.

* 13 జనవరి 2022న  : పశ్చిమ బెంగాల్ లోని అలీపుర్దువార్ లోని బికనీర్-గౌహతి ఎక్స్ ప్రెస్ కు చెందిన 12 బోగీలు పట్టాలు తప్పడంతో 9 మంది మృతి చెందగా, 36 మంది గాయపడ్డారు.

2023 జూన్ 2 : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ట్రిపుల్ రైలు ప్రమాదంలో కనీసం 233 మంది మరణించారు. 900 మంది గాయపడ్డారు.

2023 అక్టోబర్ 29 : ఏపీలోని విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటన లో 14 మంది వరకు చనిపోయారు..ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇలా వరుస ప్రమాదాలు జరుగుతున్న రైల్వే శాఖా మాత్రం ప్రమాదాలను అరికట్టడంలో విఫలం అవుతూనే ఉంది. ఇప్పటికైనా ప్రమాదాలను అరికట్టడం ఫై శ్రద్ద పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Read Also : Human Error : ఆ రైలు లోకోపైలట్ సిగ్నల్ జంప్ వల్లే ప్రమాదం ?!