పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం పాక్‌పై దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్‌కు టర్కీ మద్దతు (Turkey Support Pakistan) తెలిపి భారతీయుల (Indians) మనోభావాలు దెబ్బతీసింది. దీంతో మహారాష్ట్రలోని పుణే నగరంలో వ్యాపారులు టర్కీ నుంచి దిగుమతి అయ్యే పండ్ల(Turkish Apples Disappear)పై నిషేధం (Boycott ) విధించారు. టర్కీ నుంచి దిగుమతి అయ్యే యాపిల్స్, చెర్రీ, ప్లమ్, పియర్ వంటి పండ్లను ఇకపై మార్కెట్‌లోకి తీసుకురావద్దని. వాటిని అనుమతి ఇచ్చేది లేదని ప్రకటించారు. ఈ నిర్ణయం ఫలితంగా టర్కీకి ఏకంగా రూ.1200 నుంచి రూ.1500 కోట్ల వరకు వ్యాపార నష్టం వాటిల్లనుంది.
Health Tips: ఈ ఒక్క పండు తింటే చాలు.. రోజంతా హుషారుగా ఉండడంతో పాటు ఆ జబ్బులన్నీ పరార్!
పుణే APMC మార్కెట్ కమిటీ తరఫున టర్కీ పండ్లపై తీసుకున్న ఈ నిర్ణయం దేశభక్తి ప్రేరణతో కూడుకున్నదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. “దేశానికి శత్రువులుగా ఉన్నవాళ్లతో వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు” అని పుణేకు చెందిన యాపిల్ వ్యాపారి సుయోగ్ జెండే స్పష్టం చేశారు. టర్కీ నుంచి టన్నుల కొద్ది యాపిల్స్ దిగుమతి అయ్యే పరిస్థితుల్లో, ఇప్పుడు అవి పూర్తిగా నిలిచిపోవడంతో మార్కెట్‌యార్డుల్లో టర్కిష్ యాపిల్స్ కనపడడం లేదు. పైగా ప్రజలు కూడా ఈ యాపిల్స్‌ను కొనుగోలు చేయడం మానేయడంతో, వ్యాపారులకు కూడా నష్టం వచ్చినప్పటికీ ఇది దేశానికి మేలు చేస్తుందనే భావన కనిపిస్తోంది.
టర్కీకి వ్యాపార నష్టం కలిగించే విధంగా భారత వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన తీరు గమనార్హం. భారతదేశం గతంలో టర్కీలో భూకంపం వచ్చినప్పుడు సహాయానికి పరుగెత్తినప్పటికీ, ఇప్పుడు అదే టర్కీ పాక్‌కు డ్రోన్లు పంపుతూ మద్దతు ఇస్తోంది. దీంతో భారతీయుల కోపం కట్టలు తెచ్చుకుంది. ప్రస్తుతం పుణే వ్యాపారులు టర్కీ యాపిల్స్‌కు బదులుగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇరాన్ వంటి ప్రాంతాల నుంచి యాపిల్స్ కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.