Taj -Ayodhya : తాజ్ మహల్ కళ తప్పుతుంది..రామాలయానికి వెలుగు పెరుగుతుంది

Taj -Ayodhya : గతంలో దేశీయ, విదేశీ పర్యాటకులందరూ అత్యధికంగా తాజ్ మహల్‌ను సందర్శించేందుకు ఆగ్రాకు వెళ్లేవారు. అయితే ఇప్పుడు ఆయోధ్య రామాలయం (Ayodhya Ram Temple ) అందరి దృష్టిని ఆకర్షిస్తుందన్నారు.

Published By: HashtagU Telugu Desk
Taj Ayodhya

Taj Ayodhya

ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటిగా నిలిచిన తాజ్ మహల్‌(Taj Mahal)కి పర్యాటకుల రద్దీ తగ్గుతోందని(Tourist traffic is decreasing) ఉత్తర ప్రదేశ్ పర్యాటక శాఖ (Uttar Pradesh Tourism Department) వెల్లడించింది. గతంలో దేశీయ, విదేశీ పర్యాటకులందరూ అత్యధికంగా తాజ్ మహల్‌ను సందర్శించేందుకు ఆగ్రాకు వెళ్లేవారు. అయితే ఇప్పుడు ఆయోధ్య రామాలయం (Ayodhya Ram Temple) అందరి దృష్టిని ఆకర్షిస్తుందన్నారు.

2024 జనవరి నుండి సెప్టెంబర్ వరకు అయోధ్య రామాలయానికి 13.55 కోట్ల మంది పర్యాటకులు వచ్చారని, ఈ సంఖ్య తాజ్ మహల్ సందర్శకుల సంఖ్యను దాటినట్లు పేర్కొన్నారు. తాజ్ మహల్‌ను 12.51 కోట్ల మంది మాత్రమే సందర్శించారని తెలిపారు. రామాలయ నిర్మాణం పూర్తవడంతో, ఆ స్థలానికి ప్రజల ఆకర్షణ మరింతగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రామాలయానికి వెళ్లే పర్యాటకులు ఆధ్యాత్మిక చింతనతో పాటు, ధార్మిక విశ్వాసాల కారణంగా పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. తాజ్ మహల్‌ ఒక చారిత్రక కట్టడం కావడం వల్ల దాని పర్యాటక ప్రయోజనం నెమ్మదిగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువత మధ్య ఆధ్యాత్మిక పర్యటనలపై ఆసక్తి పెరుగుతున్నది. ఇతర దేశాలకు చెందిన పర్యాటకులు కూడా రామాలయాన్ని సందర్శించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ ప్రమాణాలు, పర్యాటక ప్రచారాల కారణంగా రామాలయాన్ని ప్రపంచవ్యాప్తంగా చర్చిస్తున్నారు.

ఇక తాజ్ మహల్ పర్యాటక రంగంలో తన ప్రత్యేకతను నిలుపుకోవడానికి కొత్త విధానాలు ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. యూపీ పర్యాటక శాఖ తాజ్ మహల్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహించడం ద్వారా సందర్శకులను ఆకర్షించేందుకు ప్రయత్నించవచ్చు. మరో రాబోయే రోజుల్లో ఇంకా ఎంతవరకు సందర్శకులు తగ్గుతారో అని అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : Vidudala 2 Review & Rating : విడుదల 2 : రివ్యూ

  Last Updated: 20 Dec 2024, 07:23 PM IST