Rajya Sabha Polls : రాజ్యసభ పోల్ డే నేడే.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నికైంది వీరే

Rajya Sabha Polls : దేశంలోని 15 రాష్ట్రాల నుంచి రాజ్యసభ ఎంపీల ఎంపికకు ఇవాళ (ఫిబ్రవరి 27న) పోలింగ్ జరగనుంది.

  • Written By:
  • Updated On - February 27, 2024 / 07:59 AM IST

Rajya Sabha Polls : దేశంలోని 15 రాష్ట్రాల నుంచి రాజ్యసభ ఎంపీల ఎంపికకు ఇవాళ (ఫిబ్రవరి 27న) పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కంటిన్యూ అవుతుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది.   12 రాష్ట్రాల నుంచి 41 సీట్లు ఖాళీగా ఉండటంతో అంతే సంఖ్యలో అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. అలాంటి పరిస్థితుల్లో 12 రాష్ట్రాల నుంచి 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా రాజ్యసభ ఎంపీలు అయ్యారు. దీంతో మిగిలిన మూడు రాష్ట్రాలకు రాజ్యసభ ఎన్నికలు ఇవాళ జరుగుతాయి.  ఉత్తరప్రదేశ్‌లోని 10, కర్ణాటకలోని నాలుగు, హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక స్థానానికి పోలింగ్ జరగనుంది. ఈ 15 రాజ్యసభ స్థానాల్లో హోరాహోరీ పోటీ నెలకొంది.  ఉత్తరప్రదేశ్‌లోని 10 రాజ్యసభ స్థానాలకు మంగళవారం ఓటింగ్(Rajya Sabha Polls) జరగనుంది. మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో భారతీయ జనతా పార్టీకి చెందిన 8 మంది, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ముగ్గురు ఉన్నారు. 403 మంది సభ్యులున్న యూపీ అసెంబ్లీలో కేవలం 397 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు వేసేందుకు అర్హులు.

We’re now on WhatsApp. Click to Join

ఏకగ్రీవమైన ప్రముఖులు వీరే.. 

ఏకగ్రీవం అయిన 41 మంది రాజ్యసభ ఎంపీల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఉన్నారు. వీరే కాకుండా ఇటీవలె కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ఎల్ మురుగన్ పెద్దల సభకు ఏకగ్రీవం అయ్యారు.ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి అత్యధికంగా 20 మంది ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరుగురు, తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు, వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ముగ్గురు, ఆర్జేడీ నుంచి ఇద్దరు, బీజేడీ నుంచి ఇద్దరు, ఎన్సీపీ, శివసేన, బీఆర్ఎస్, జేడీయూ పార్టీల నుంచి ఒక్కో అభ్యర్థి రాజ్యసభకు పోటీ లేకుండానే ఎన్నికయ్యారు.ఇక మిగిలిన 15 స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ 15 స్థానాలు ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నాయి.

Also Read : Firoz Merchant : 900 మంది ఖైదీలను విడిపించిన ఒకే ఒక్కడు

తెలంగాణలో ఇలా..

ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 6 ఖాళీలు ఏర్పడనుండగా.. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల విత్‌ డ్రా సమయానికి పోటీలో ఒక్కొక్క అభ్యర్థి మాత్రమే బరిలో నిలవగా.. వారినే విజేతలుగా అధికారులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు, తెలంగాణలో ముగ్గురు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ స్థానాల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలు, బీఆర్ఎస్ ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరీ, యువ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్‌ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక బీఆర్ఎస్ పార్టీ తరఫున మరోసారి వద్దిరాజు రవిచంద్రకు అవకాశం దక్కింది.

Also Read : Ap : స్పీకర్ తమ్మినేని సంచలన నిర్ణయం – 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

ఏపీలో ఇలా..

ఆంధ్రప్రదేశ్‌లోని 3 రాజ్యసభ స్థానాలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. వైసీపీ తరపున రాజ్యసభ సభ్యలుగా గొల్ల బాబూరావు, వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డిలు నామినేషన్లు దాఖలు చేయగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యసభలో ఆ పార్టీ ప్రాతినిథ్యం కోల్పోయింది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విముఖత చూపడంతో ఆ పార్టీ తరపున ఎవరు నామినేషన్ వేయలేదు.

Also Read : Indiramma Abhayam Scheme : ఏపీలో కాంగ్రెస్ ప్రకటించిన తొలి హామీ ఇదే..