Site icon HashtagU Telugu

Top News Today: దేశవ్యాప్తంగా చర్చనీయ అంశాలు

Top Today News

Top Today News

Top News Today: పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరుపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో ప్రచారం చేయనున్నారు

మరి కొద్దిరోజుల్లో తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల కానుంది. ఇవాళ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలవుతున్నాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

సీఎం జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. 2019 ఎన్నికల సమయంలో బహిరంగ సభల్లో ప్రజలకు ఇచ్చిన హామీల వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ చర్చకు సిద్ధమా జగన్ రెడ్డీ అంటూ చంద్రబాబు సవాల్ విసిరారు.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి ఈడీ విచారణకు దూరంగా ఉన్నారు. ఈడీ అధికారులు కేజ్రీవాల్‌కు ఆరోసారి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈడీ విచారణకు సీఎం హాజరుకావడం లేదని ఆప్‌ వర్గాలు వెల్లడించాయి.

డ్వాక్రా సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. కొన్నేళ్లుగా నిలిచిపోయిన రుణాలను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు.

మేడారం కుంభమేళా ఈనెల 21 నుంచి ప్రారంభం కానుండగా.. 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.

వాట్సాప్ యాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతేడాది వాట్సాప్ ఛానల్స్‌ను పరిచయం చేసిన సంస్థ.. తాజాగా ఛానెల్ ఓనర్‌షిఫ్‌ను మరొకరికి బదిలీ చేసే సదుపాయం కల్పించింది

రాజ్‌కోట్‌లో ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ 434 పరుగులతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. దీంతో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యం సాధించింది

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో ఓ భారీ చిత్రం పట్టాలెక్కనుంది. ఈ చిత్రంలో చెర్రీకి జోడిగా నటించే భామ ఎవరో కన్ఫర్మ్ అయింది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ రామ్ చరణ్ సినిమాలో నటిస్తున్నట్టు ఆమె తండ్రి బోణి కపూర్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 57,200 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 62,400 వద్దకు చేరింది. అలాగేహైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర 78,000 గా ఉంది.

Also Read: Vijay Devarakonda : విజయ్ హీరోయిన్ రేసులో రష్మిక కూడానా.. విడి 12 ఈ సస్పెన్స్ వీడేది ఎప్పుడు..?

Exit mobile version