Working Hours Ranking : ప్రైవేటు రంగంలోని ఉద్యోగుల పని గంటలపై ఇప్పుడు వాడివేడి చర్చ జరుగుతోంది. ఉద్యోగులు వారానికి ఎన్ని గంటలు పనిచేయాలి ? అనే దానిపై సామాన్యుల నుంచి కార్పొరేట్ కంపెనీలను నడుపుతున్న కుబేరుల దాకా ప్రతీ ఒక్కరు డిస్కస్ చేసుకుంటున్నారు.
Also Read :Bus Conductor Vs Retired IAS : రిటైర్డ్ ఐఏఎస్‌పై బస్సు కండక్టర్ దాడి.. రూ.10 టికెట్ వల్లే!
ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఈ అంశంపై తొలుత కామెంట్లు చేశారు. ఉద్యోగులు వారానికి కనీసం 70 నుంచి 80 గంటలు పనిచేస్తే తప్పేంటని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన ట్రెండ్‌ను తాజాగా ఎల్‌అండ్‌టీ గ్రూప్ ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ కంటిన్యూ చేశారు. ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేస్తే తప్పేంటని ఈయన అభిప్రాయపడ్డారు. దీన్ని విని చాలా కార్పొరేట్ కంపెనీల యజమానులు స్పందించారు. ఆనంద్ మహీంద్రా (మహీంద్రా గ్రూప్) నుంచి అదర్ పూనావాలా (సీరం ఇన్‌స్టిట్యూట్) దాకా వారానికి 90 గంటల పనిని వ్యతిరేకించారు. ఎంత పనిచేశాం అనే దానికంటే.. ఎలా పనిచేశాం అనేదే ముఖ్యమని వారు వాదించారు. ఈ నేపథ్యంలో పనిగంటల వ్యవహారంలో టాప్-10 ప్రపంచ దేశాలు ఏవి ? మన భారత దేశం ర్యాంకు ఎంత ? అనేది తెలుసుకుందాం..
Also Read :PM Modi : ఇవాళ సాయంత్రం కిషన్ రెడ్డి నివాసానికి ప్రధాని మోడీ.. ఎందుకో తెలుసా ?
పనిగంటల్లో భారత్ స్థానం ఎంతో తెలుసా ?
ప్రపంచంలో వారానికి అత్యధిక పనిగంటలు ఉన్న దేశం ఏదో తెలుసా ? భూటాన్. ఈ దేశంలో ఉద్యోగులు వారానికి సగటున 54.4 గంటల పాటు పనిచేస్తారు. యూఏఈలో ఉద్యోగులు వారానికి 50.9 గంటల పాటు పనిచేస్తారు. లెసెతో దేశంలో వారానికి 50.4 గంటలు, కాంగోలో వారానికి 48.6 గంటలు, ఖతర్‌లో వారానికి 48 గంటలు పనిచేస్తారు. లైబీరియాలో వారానికి 47.7 గంటలు, మౌరిటానియాలో వారానికి 47.6 గంటలు, లెబనాన్‌లో వారానికి 47.6 గంటలు, మంగోలియాలో వారానికి 47.3 గంటలు, జోర్డాన్‌లో వారానికి 47.0 గంటలు పనిచేస్తారు. ఈ జాబితాలో మన భారతదేశం(Working Hours Ranking) 13వ స్థానంలో ఉంది. మన దేశంలోని ఉద్యోగులు/కార్మికులు ప్రతివారం సగటున 46.7 గంటల పాటు పనిచేస్తుంటారు. మన దేశంలోని 51 శాతం మంది శ్రామికులు, కార్మికులు ప్రతివారం 49 గంటల కంటే ఎక్కువే పనిచేస్తుంటారు.
పనిగంటలు తక్కువున్న ప్రపంచ దేశాలివీ..
ప్రపంచంలో వారానికి అతి తక్కువ పనిగంటలు ఉన్న దేశం ఏదో తెలుసా ? వనాటు. ఈ దేశంలో ఉద్యోగులు వారానికి సగటున 24.7 గంటలే పనిచేస్తారు. కిరిబాటలో వారానికి 27.3 గంటలు, మైక్రోనేషియాలో వారానికి 30.4 గంటలు, రువాండలో వారానికి 30.4 గంటలు, సోమాలియాలో వారానికి 31.4 గంటలు, నెదర్లాండ్స్‌లో వారానికి 31.6 గంటలు, ఇరాక్‌లో వారానికి 31.7 గంటలు, వాలిస్, పుటునా దీవుల్లో వారానికి 31.8 గంటలు, ఇథియోఫియాలో వారానికి 31.9 గంటలు, కెనడాలో వారానికి 32.1 గంటలే ఉద్యోగులు పనిచేస్తుంటారు.