Site icon HashtagU Telugu

Deendayal Upadhyaya : ఇవాళ అంత్యోదయ దివస్.. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జీవితంలోని కీలక ఘట్టాలివి

Pandit Deendayal Upadhyaya Antyodaya Diwas 2024

Deendayal Upadhyaya : ఇవాళ అంత్యోదయ దివస్. విఖ్యాత నేత పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈరోజు  అంత్యోదయ దివస్‌గా నిర్వహిస్తున్నారు. అణగారిన వర్గాలు, పేదల అభ్యున్నతి కోసం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ(Deendayal Upadhyaya) చేసిన సేవలను అంత్యోదయ దివస్ సందర్భంగా గుర్తు చేసుకుంటారు.

Also Read :Pakistan Beggars : పాకిస్తాన్ భిక్షగాళ్లకు సౌదీ అరేబియా వార్నింగ్.. ఎందుకు ?

దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జీవిత ప్రస్థానం.. 

  • దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అతి సామాన్య కుటుంబంలో జన్మించారు.
  • చిన్నతనంలోనే తల్లి, తండ్రి మరణించారు. దీంతో మేనమామ ఇంట్లో ఆయన పెరిగారు.
  • కాన్పూర్‌లో బీ.ఏ చదువుతుండగా ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు.
  • సంఘ్‌లో పనిచేస్తూనే బీ.ఏ, డిగ్రీ, ఉపాధ్యాయ శిక్షణ ఎంఏలను దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పూర్తిచేశారు.
  • అనంతరం ఆర్ఎస్ఎస్ విస్తరణకు పూర్తి సమయం వెచ్చించారు.
  • తొలుత ఉత్తరప్రదేశ్‌లోని లభంపూర్‌ ప్రాంతానికి ప్రచారకులుగా నియమితులయ్యారు.
  • అనంతరం ఆయనను ఉత్తరప్రదేశ్‌ ప్రాంత సహ ప్రచారకులుగా నియమించారు.
  • రాష్ట్ర ధర్మ ప్రకాశన్‌ అనే పేరుతో ఒక మాస పత్రిక, పాంచజన్య అనే పేరుతో ఒక వారపత్రిక, స్వదేశ్‌ అనే పేరుతో ఒక దినపత్రికను ఆయన నడిపారు.
  • డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ 1951 అక్టోబర్ 21న ఏర్పాటు చేసిన జనసంఘ్‌ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా దీనదయాళ్‌ ఎన్నికయ్యారు. ఈ పార్టీ స్థాపించిన మూడు నెలలకే జాతీయ పార్టీగా గుర్తింపు లభించింది.
  • దేశ రాజకీయాలలో జనసంఘ్‌కు ప్రత్యేక స్థానాన్ని కల్పించడంలో దీనదయాళ్‌ సక్సెస్ అయ్యారు. 1967లో ఆయన పార్టీ అఖిల భారత అధ్యక్షులయ్యారు.
  • నేటికీ భారత యువత దీన్‌దయాళ్ ఉపాధ్యాయను  స్ఫూర్తిగా తీసుకుంటోంది. ఆయన జీవితంలో ఎన్ని అవరోధాలు వచ్చాయి. అయినా వాటిని సహనంతో అధిగమించారు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం కడదాకా పోరాడారు.అందుకే నేటికీ ఆయనను యావత్ దేశం గుర్తు చేసుకుంటోంది.
  • ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా చాలా ప్రసంగాల్లో దీన్‌దయాళ్ ఉపాధ్యాయను  స్మరించుకుంటూ ఉంటారు. ఆయనను తన స్ఫూర్తిప్రదాతగా కీర్తిస్తుంటారు.