ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ (Pahalgam) ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి (Terror Attack) దేశవ్యాప్తంగా గానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. అమాయక పర్యాటకులపై జరిగిన ఈ దాడిలో 26 మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన పై కాశ్మీర్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్పందిస్తూ.. ఈ దాడికి పాకిస్తానే కారణమని తీవ్రంగా విమర్శించారు. మానవత్వాన్ని, పర్యాటకాన్ని, కాశ్మీరీల జీవనోపాధిని పాకిస్తాన్ తట్టుకోలేకే దాడులకు పాల్పడిందని మండిపడ్డారు.
Mithra Mandali: ఆకట్టుకుంటున్న ‘మిత్ర మండలి’ ఫస్ట్ లుక్
గత కొన్ని సంవత్సరాల్లో కాశ్మీర్‌లో పరిస్థితులు మెరుగవుతున్నాయని, పర్యాటక రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఈ పరిణామాలతో స్థానికులకు జీవనోపాధి లభిస్తున్న నేపథ్యంలో అది చూసి అసహనానికి గురైన పాకిస్తాన్ ఉగ్రవాదులను ఉసిగొల్పిందని ఆరోపించారు. పాకిస్తాన్ మానవత్వానికి, పర్యాటక అభివృద్ధికి, కాశ్మీరీ ప్రజల బతుకులకు వ్యతిరేకమని ప్రధాని విమర్శించారు. పాక్ బహిరంగంగా ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలతో పాకిస్తాన్ అంతర్జాతీయంగా మరింత ఒత్తిడిలో పడింది. ఇప్పటికే పాక్ తమ భూభాగంలో ఉగ్రవాద శిబిరాలను నిర్వహిస్తున్నట్లు పలు దేశాలు ఆరోపిస్తున్న తరుణంలో, మోదీ చేసిన వ్యాఖ్యలు ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చాయి. ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై క్లిష్ట దాడులు చేసిన సంగతి తెలిసిందే. భారత్ పోరాటం పాకిస్తాన్ ప్రజలపై కాదని, కేవలం ఉగ్రవాదులపై మాత్రమేనని ప్రధాని మోదీ స్పష్టం చేయడం గమనార్హం.