Site icon HashtagU Telugu

World Leaders : మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రపంచ దేశాధినేతలు

Narendra Modi

Narendra Modi

World Leaders : నరేంద్రమోడీ శనివారం రోజు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం ఢిల్లీలోని కర్తవ్య పథ్ వేదికగా అట్టహాసంగా జరగనుంది. దీనికి పలువురు విదేశీ నేతలు కూడా హాజరుకానున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్‌, నేపాల్, మారిషస్ దేశాల అధినేతలు విచ్చేయనున్నారు.  ఇప్పటికే రణిల్‌ విక్రమసింఘేకు ఆహ్వానం వెళ్లగా, ఆయన వచ్చేందుకు అంగీకరించారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్ హసీనాతో మోడీ(World Leaders) ఫోనులో మాట్లాడి.. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని కోరారు.

We’re now on WhatsApp. Click to Join

మోడీ ప్రమాణస్వీకారానికి రావాలని నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్‌ దహల్‌ ప్రచండ, భూటాన్ ప్రధాని షెరింగ్ తోగ్బే, మారిషస్ ప్రధానమంత్రి పర్వింద్ జుగ్నౌత్‌లకు ఆహ్వానం పంపినట్లు సమాచారం. 2014లో మోడీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన టైంలో సార్క్‌(SAARC) దేశాల అధినేతలు హాజరయ్యారు. 2019లో బిమ్స్‌టెక్‌ (BIMSTEC) దేశాల నాయకులు ప్రమాణస్వీకారానికి విచ్చేశారు.ప్రభుత్వ ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ విధానాన్ని ప్రతిబింబిస్తూ ప్రమాణ స్వీకారోత్సవానికి దక్షిణాసియా అగ్రనేతలను ఈసారి మోడీ ఆహ్వానిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమికి మ్యాజిక్ ఫిగర్ 272కుపైనే లోక్‌సభ సీట్లు వచ్చాయి. అయితే బీజేపీకి 240కి మించి లోక్‌సభ సీట్లు రాలేదు. దీంతో ఎన్డీయే కూటమిలోని ఇతర పార్టీలపై బీజేపీ ఆధారపడాల్సిన  పరిస్థితి వచ్చింది.

Also Read : Nightmares : పీడకలలు వస్తున్నాయా ? అవి రావొద్దంటే ఇలా చేయండి

నితీశ్ కింగ్ మేకరే అయితే.. ఆ పని చేసి చూపించు : తేజస్వి

బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు సీఎం నితీశ్ కుమార్ ఎన్డీయేలో ‘కింగ్ మేకర్’ హోదాను ఉపయోగించాలని రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ నేత తేజస్వీ యాదవ్ కోరారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్డీయేకు సంఖ్యా బలం ఉందన్నారు. బిహార్‌కు ప్రత్యేక హోదాను ప్రకటించే ప్రభుత్వం రావాలని తాము కోరుకుంటున్నట్లు తేజస్వి వెల్లడించారు. నిజంగా ‘నితీశ్ కుమార్ కింగ్‌మేకర్‌ అయితే ఇదే మంచి ఛాన్స్.. బిహార్‌కు ప్రత్యేక హోదాను సాధించాలని ఆయన కోరారు.

Also Read : BJP : తెలంగాణ బీజేపీ ఎంపీలు ఢిల్లీకి పయనం