Site icon HashtagU Telugu

Waqf Bill : వక్స్ చట్ట సవరణతో రాబోయే మార్పులు ఇవే..!

Waqf Bill Loksabha

Waqf Bill Loksabha

కేంద్ర ప్రభుత్వం వక్స్ చట్ట సవరణ బిల్లు(Waqf Bill)ను ఈరోజు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. తొలుత లోక్సభ(LokSabha)లో, ఆపై రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చ జరగనుంది. అధికార పక్షం ఈ చర్చకు 8 గంటలు కేటాయించనున్నట్లు ప్రకటించగా, ప్రతిపక్షాలు 12 గంటల సమయం కావాలని డిమాండ్ చేస్తున్నాయి. అవసరమైతే చర్చ సమయాన్ని పెంచుతామని స్పీకర్ ఓంబిర్లా స్పష్టంచేశారు. కాంగ్రెస్, TMC, SP, MIM, DMK వంటి ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి.

Yoga Poses: అంద‌మైన చ‌ర్మం కోసం ఈ యోగాస‌నాలు వేయాల్సిందే!

ఈ సవరణ బిల్లుతో వక్ఫ్ బోర్డుల నిర్వహణలో కీలక మార్పులు రాబోతున్నాయి. ప్రధానంగా ఈ బిల్లు చట్టరూపం దాల్చితే మహిళలు సహా ముస్లిమేతరులను కూడా వక్ఫ్ బోర్డుల సభ్యులుగా నియమించుకునే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది. ఇదే కాకుండా వక్ఫ్ ఆస్తులన్నింటిని కలెక్టర్ల వద్ద రిజిస్టర్ చేయాల్సిన నిబంధన ఈ బిల్లులో ఉంది. ఇది వివాదాలకు తావు లేకుండా చూడడమే లక్ష్యంగా తీసుకొస్తున్న మార్పుగా కేంద్రం చెబుతోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 9.4 లక్షల ఎకరాల భూములు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. రైల్వే, ఆర్మీ ఆస్తుల తర్వాత వక్ఫ్ భూములే దేశంలో అతిపెద్దవి. తాజా బిల్లులోని నిబంధనలతో ఈ ఆస్తుల నిర్వహణ మరింత పారదర్శకంగా మారనుంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ చర్యలు ముస్లిం మైనారిటీ హక్కులను హరించడమేనని విమర్శిస్తున్నాయి. ఏదేమైనా ఈ బిల్లు చట్టంగా మారితే దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.