Site icon HashtagU Telugu

India – Pakistan War : భారత్‌ ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాలు ఇవే..

Operation Sindoor

Operation Sindoor

పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది.. పాక్‌, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి మెరుపుదాడి చేసింది. దాయాదిపై భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్యలో ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు పాల్గొన్నాయి. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ఈ దాడి జరిగింది ఈ దాడుల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశారు.

1. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్‌ పూర్‌లో ఉన్న జై-షే మహమ్మద్ ప్రధాన కార్యాలయం

2. మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ దూరంలో ఉన్న లష్కరే క్యాంప్‌

3. సరిహద్దు నియంత్రణ రేఖ పూంఛ్‌- రాజౌరీకి 35 కి.మీ దూరంలో ఉన్న గుల్పూర్‌

India – Pakistan War : పాక్ స్థావరాలపై భారత్ మెరుపు దాడులు – 30 మంది ఉగ్రవాదులు మృతి

4. పాక్‌ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లోని తంగ్ధర్ సెక్టార్ లోపల 30 కి.మీ పరిధిలో ఉన్న సవాయ్‌ లష్కరే క్యాంప్‌

5. జే-షే-మహమ్మద్ లాంచ్‌ ప్యాడ్‌ బిలాల్‌ క్యాంప్‌

6. రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 15 కి.మీ.ల దూరంలో ఉన్న జే-షే-మహమ్మద్ లాంచ్‌ ప్యాడ్‌

7. రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 10.కి.మీ పరిధిలో ఉన్న బర్నాలా క్యాంప్‌

8. సాంబా-కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు 8కి.మీ దూరంలో ఉన్న జై-షే-మహమ్మద్ సర్జల్ క్యాంప్

CBN Gift : బాలకృష్ణ కు చంద్రబాబు మరో గిఫ్ట్

9. అంతర్జాతీయ సరిహద్దు కు 15 కిమీ దూరంలో సియాల్‌కోట్ సమీపంలో ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ శిక్షణా శిబిరం మెహమూనా క్యాంప్ వంటి కేంద్రాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడులతో ఉగ్రవాదుల నెట్‌వర్క్‌కు గట్టి దెబ్బ తగలగా, భారతదేశపు రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచం ముందు చాటిచెప్పే చర్యగా ఈ ఆపరేషన్ నిలిచింది.