Architect Jobs : ఇళ్ల నిర్మాణం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఇంజినీర్లే. అయితే అందమైన వాస్తు శిల్పంతో నిర్మించే ఇళ్లు, భవనాల వెనుక ఉండే అద్భుత నిపుణుల గురించి చాలామందికి తెలియదు. వాళ్లే ఆర్కిటెక్ట్‌లు. ఆర్కిటెక్ట్‌లను తెలుగులో వాస్తుశిల్పులు అని పిలుస్తారు. సివిల్ ఇంజినీర్ అనే వాడు ఇంటిని టెక్నికల్‌గా సరిగ్గా నిర్మించి ప్రాణం పోస్తాడు. ఆ ఇంటికి జీవం పోసేలా ఉండే వాస్తుశిల్పం డిజైన్‌ను అందించేది ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్ట్‌లు ఇచ్చే అద్భుత డిజైనింగ్ ప్రకారం నిర్మాణం జరగడం వల్లే భవనాలు వెరైటీగా, ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ నైపుణ్యాలు కలిగిన వారికి ఇప్పుడు జాబ్ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. కొన్ని పెద్ద నిర్మాణ రంగ కంపెనీలైతే ఏటా రూ.15 లక్షల దాకా శాలరీ ఇచ్చి మరీ ఆర్కిటెక్ట్‌లను నియమించుకుంటున్నాయి. అంటే ప్రతినెలా రూ.1 లక్షకుపైనే శాలరీని వారు అందుకుంటున్నారు.
Also Read :Trump Vs Zelensky: డొనాల్డ్ ట్రంప్‌తో జెలెన్ స్కీ వాగ్వాదం.. కారణం ఇదీ
ఆర్కిటెక్ట్ కావాలంటే ఏం చేయాలి ?
ఆర్కిటెక్ట్ కావాలని భావించే వారు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీ.ఆర్క్) కోర్సును చేయాలి. దీని వ్యవధి ఐదేళ్లు. ఈ కోర్సులో అడ్మిషన్ లభించాలంటే నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా) లేదా జేఈఈ పేపర్ 2లో అర్హత సాధించాలి.
Also Read :Location Tracking Device: గూడ్స్, ప్యాసింజర్ వాహనాల్లో ఇక ఆ డివైజ్ తప్పనిసరి !
ఆర్కిటెక్ట్‌లు ఏ పనులు చేస్తారు ?
- వ్యక్తిగత ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వాస్తుశిల్పాన్ని(Architect Jobs) ఆర్కిటెక్ట్‌లు అందిస్తారు.
- అపార్ట్‌మెంట్‌లు, షాపింగ్ మాల్స్, ఆఫీస్ బిల్డింగ్‌లకు అవసరమైన వాస్తుశిల్పాన్ని ఇస్తారు.
- రోడ్లు, బ్రిడ్జీలు, గవర్నమెంట్ భవనాల వంటి ప్రభుత్వ ప్రాజెక్టులకు వాస్తుశిల్పాన్ని డిజైన్ చేస్తారు.
- మల్టీనేషనల్ కంపెనీల క్యాంపస్ డిజైన్‌లను తయారు చేస్తారు.
- మ్యూజియంలు, హోటల్స్, ఎయిర్‌పోర్ట్, స్టేడియం, దేవాలయాల వంటి ప్రత్యేక భవనాలకు డిజైన్లను అందిస్తారు.
- ఇంటిని నిర్మించుకునే వ్యక్తి అవసరాలు, అభిరుచికి అనుగుణంగా డిజైన్‌ను అందించే నైపుణ్యం ఆర్కిటెక్ట్‌లకు ఉంటుంది.
- ప్రభుత్వ నియమాలు, భద్రతా ప్రమాణాల ప్రకారం ఇళ్లు ఉండేలా వాస్తుశిల్పులు డిజైన్ ఇస్తారు.
- భవనాన్ని వీలైనంత తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందగలిగేలా నిర్మించడంలో ఆర్కిటెక్ట్ కీలక పాత్ర పోషిస్తాడు.