Site icon HashtagU Telugu

Jammu and Kashmir : జమ్మూ కశ్మీర్‌లో ప్రశాంతంగా ముగిసిన రెండో దశ పోలింగ్‌..

The second phase of polling ended peacefully in Jammu and Kashmir.

The second phase of polling ended peacefully in Jammu and Kashmir.

Jammu and Kashmir Assembly Election: జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్‌ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. రెండో దశలో ఆరు జిల్లాల పరిధిలోని 26 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్‌ జరిగింది. 25లక్షలమందికిపైగా ఓటర్లు ఓటు వేశారు. రెండో శ్రీనగర్ జిల్లాలోని ఎనిమిది స్థానాలకు ఓటింగ్ జరిగింది. రియాసిలో ఆరు, బుద్గామ్‌లో ఐదు, రియాసి, పూంచ్‌ జిల్లాల్లో మూడు చొప్పున, గందర్‌బల్‌లో రెండు స్థానాలకు ఓటింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు జమ్మూ కశ్మీర్‌లో 54 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా రియాసి జిల్లాలో 71.81 శాతం ఓటింగ్‌ నమోదు కాగా, శ్రీనగర్‌ జిల్లాలో అత్యల్పంగా 27.31 శాతం ఓటింగ్‌ రికార్డయ్యింది. ఇంతకు ముందు 18న జరిగిన తొలి దశలో 61.38 శాతం ఓటింగ్ శాతం నమోదైన విషయం తెలిసిందే. అత్యధికంగా కిష్త్వార్ జిల్లాలో 80.20 శాతం ఓటింగ్ జరగ్గా.. అత్యల్పంగా పుల్వామా జిల్లాలో 46.99 శాతం ఓటింగ్ నమోదైంది.

Read Also: Rahul Gandhi : ప్రభుత్వ విధానాన్ని ఎవరు నిర్ణయిస్తారు..? బిజెపి ఎంపీనా..? లేక మోడీనా..?: రాహుల్ గాంధీ

కాగా, దాదాపు సాయంత్రం 5 గంటల వరకు 54 శాతం పోలింగ్‌ నమోదైంది. రెండో దశలో 26 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ బూతులకు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రెండో విడతలో 239 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా, బీజేపీ జమ్మూ కాశ్మీర్ చీఫ్ రవీంద్ర రైనా పోటీలో ఉన్నారు. సెప్టెంబర్ 18న తొలి విడత పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. సెకండ్ విడత కూడా దాదాపు అదే రేంజ్‌లో సాగింది. ఇక మూడో విడత అక్టోబర్ 1న జరగనుంది. మిగిలిన అన్ని స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి. గెలుపుపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Read Also: BJP : ఆమ్ ఆద్మీ పార్టీ షాక్‌..బీజేపీలో చేరిన ఇద్దరు కౌన్సిలర్లు