Miyawaki Magic : కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ లాంటి నగరాల్లో వాతావరణం కాలుష్యభరితంగా మారిపోతోంది. వాతావరణంలో ఆక్సిజన్ మోతాదు తగ్గిపోయి, కాలుష్య ఉద్గారాలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా స్వచ్ఛమైన గాలి దొరకడం కష్టతరంగా మారుతోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మేళాకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ వేదికగా నిలుస్తోంది. అక్కడ జనవరి 13 నుంచి అంగరంగ వైభవంగా మహాకుంభ మేళా జరుగుతోంది. తొలి 11 రోజుల్లోనే 10 కోట్ల మందికిపైగా భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేసి వెళ్లారు. ఇంతమంది భక్తజనం వచ్చినా ప్రయాగ్‌రాజ్‌లో(Miyawaki Magic) ఆక్సిజన్ స్థాయి ఏ మాత్రం తగ్గలేదు. స్వచ్ఛమైన గాలికి అస్సలు కొరత ఏర్పడలేదు. దీనికి కారణం నగరం పరిధిలో ఏర్పాటు చేసిన ‘మియవాకి’ అడవి. వివరాలివీ..
Also Read :IT Raids : ఐదు రోజుల తర్వాత ముగిసిన ఐటీ రైడ్స్.. నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు
ప్రయాగ్‌రాజ్‌లో ‘మియవాకి’ చిట్టడవి ఎలా సాధ్యమైంది ?
- ‘‘చారిత్రక రోమ్ నగరం నిర్మాణం రాత్రికి రాత్రి జరిగిపోలేదు’’ అనే నానుడి ఉంది. ఏదైనా రాత్రికి రాత్రి జరిగిపోదని దాని అర్థం. అదేవిధంగా ప్రయాగ్ రాజ్‌లోని మియవాకి చిట్టడవి రాత్రికి రాత్రి ఏర్పడలేదు.
- మియవాకి అనేది జపనీస్ టెక్నిక్. దీన్ని మొక్కల పెంపకం కోసం వినియోగిస్తారు.
- తక్కువ ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలను పెంచేందుకు ఈ టెక్నిక్‌ను గుడ్డిగా ఫాలో అయిపోవచ్చు.
- జపాన్‌కు చెందిన వృక్ష శాస్త్రవేత్త అకీరా మియవాకి ఈ పద్ధతిని 1970లో ఆవిష్కరించారు. ఈ పద్ధతికి ఆయన పేరునే పెట్టారు.
- మహాకుంభ మేళా జనవరి 13న మొదలైంది.
- రెండేళ్ల కిందటే ప్రయాగ్ రాజ్‌మున్సిపల్ కార్పొరేషన్ మహాకుంభ మేళా కోసం ప్లాన్ రెడీ చేసింది.
- మేళాకు తరలివచ్చే భక్తులకు ఆక్సిజన్ కొరత ఉండకూడదనే ఉద్దేశంతో ప్రయాగ్ రాజ్ పరిధిలో చిట్టడవిని రెడీ చేయాలని అప్పట్లో నిర్ణయించారు.
- ఇందులో భాగంగా ప్రయాగ్ రాజ్ నగరం పరిధిలో వేర్వేరు చోట్ల దాదాపు 18.50 ఎకరాల్లో 5 లక్షలకుపైగా మొక్కలను నాటారు. మియవాకీ పద్ధతిలో మొక్కలను నాటారు.
- ఆ మొక్కలే రెండేళ్లలో (మహాకుంభ మేళా సమయానికి) దాదాపు 25 ఫీట్ల నుంచి 30 ఫీట్ల ఎత్తున్న చెట్లుగా ఎదిగాయి.
- ఇప్పుడు ఈ మియవాకి చిట్టడవిలోని చెట్ల నుంచి ప్రతిరోజు దాదాపు 11.5 కోట్ల లీటర్ల ఆక్సిజన్ వాతావరణంలోకి విడుదల అవుతోంది.
- వచ్చే నెలలో మహాకుంభ మేళా ముగిసే సరికి దాదాపు 45 కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్‌ను సందర్శిస్తారని అంచనా. వారందరికీ నగరంలో ఆక్సిజన్ కొరతలేకుండా స్థానికంగా ఉన్న చిట్టడవి దోహదం చేస్తోంది.