Advisory For Indians : 1971లో పాకిస్తాన్‌తో యుద్ధంలో పోరాడిన సైనికుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ బంగ్లాదేశ్‌లో పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ నిరసనల్లో ఇప్పటివరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తుండగా.. సైనికుల పిల్లలకు రిజర్వేషన్లు తొలగించలేమని దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా వాదిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఢాకాలోని భారత హైకమిషన్(Advisory For Indians) భారతీయులకు అత్యవసర అలర్ట్‌ను జారీ చేసింది.
We’re now on WhatsApp. Click to Join
బంగ్లాదేశ్‌లో ఉంటున్న భారత పౌరులు, విద్యార్థులు తమ ప్రయాణాలను కొన్నిరోజులు వాయిదా వేసుకోవాలని భారత ఎంబసీ సూచించింది. అనవసరంగా నివాసాల నుంచి బయటకు రావొద్దని కోరింది. ఇటీవల అల్లర్లు హింసాత్మకంగా మారడంతో బంగ్లాదేశ్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను మూసివేశారు. తాజాగా ఇవాళ కూడా ఢాకా అంతటా వివిధ ప్రాంతాల్లో విద్యార్థులు భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. బ్రాక్ యూనివర్శిటీ సమీపంలోని మెరుల్ బద్దాలో నిరసనకారులు రోడ్లను మూసివేయడంతో.. వారికి పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈరోజు ఉదయాన్నే వేలాది మంది నిరసనకారులు ఢాకా నగర రోడ్లపైకి పోటెత్తడంతో టియర్ గ్యాస్ ప్రయోగించి పోలీసులు వారిని చెదరగొట్టారు. ఇక జత్రాబరిలో ఢాకా-చిట్టగాంగ్ హైవేపై విద్యార్థులు రాస్తారోకోకు దిగారు. దీంతో పెద్దఎత్తున ట్రాఫిక్ జాం అయింది. అనేక స్థానిక మార్కెట్లు, దుకాణాలను మూసివేశారు.
Also Read :NEET UG Paper Leak : అది నిరూపితమైతేనే ‘నీట్-యూజీ’ రీటెస్ట్.. సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు
ఇక బంగ్లాదేశ్‌లోని భారతీయుల సహాయార్ధం అక్కడి భారత ఎంబసీ హెల్ప్ లైన్ నంబర్లను ప్రకటించింది. ఢాకా హైకమిషన్ కార్యాలయం నంబర్ 880-1937400591, చిట్టగాంగ్ నంబర్ 880-1814654797 / 880-1814654799, సిల్హెట్ నంబర్ 880-1313076411, ఖుల్నా నంబర్ 880-1812817799. ఈ ఫోన్ నంబర్లకు కాల్స్, వాట్సాప్ ద్వారా కనెక్ట్ కావొచ్చని భారత ఎంబసీ(Indian Embassy) తెలిపింది.