Cyber Horror 2024 : మన దేశంలో 2023 అక్టోబరు నుంచి 2024 సెప్టెంబరు మధ్యకాలంలో ప్రతి సెకనుకు 11 సైబర్ దాడులు జరిగాయి. దేశవ్యాప్తంగా 84 లక్షల ఎండ్‌పాయింట్లలో 36.9 కోట్ల మాల్‌వేర్లతో దాడులు జరిగాయి. ఈ లెక్కన భారత్‌లో నిమిషానికి సగటున 702 సైబర్ దాడులు జరిగాయి. హెల్త్‌కేర్, ఆతిథ్యం, ఫైనాన్స్ వంటి రంగాలపై ఈ దాడుల ప్రభావం ఎక్కువగా పడింది. సైబర్ దాడుల ప్రభావం ఏయే రంగంపై ఎంతమేర పడిందంటే.. హెల్త్‌కేర్ రంగంపై 21.82%, ఆతిథ్య రంగంపై 19.57%, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్- బీఎఫ్‌ఎస్‌ఐ రంగాలపై 17.38%, ఎడ్యుకేషన్ రంగంపై 15.64%, ఎంఎస్‌ఎంఈ రంగంపై 7.52%, మాన్యుఫ్యాక్చరింగ్ రంగంపై 6.88%, ప్రభుత్వ సంస్థలపై 6.1%, ఐటీ/ఐటీఈఎస్ రంగంపై 5.09% మేర ఎఫెక్టు పడింది. డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీఎస్‌సీఐ), సెక్‌రైట్ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ‘ఇండియా సైబర్ థ్రెట్ రిపోర్ట్-2025’లో ఈవివరాలను ప్రస్తావించారు.
Also Read :Sana Sathish : టీడీపీ రాజ్యసభ అభ్యర్థి సానా సతీష్ ఎవరు ? ఆయన నేపథ్యం ఏమిటి ?
సగటున ప్రతి 40,436 మోసాల వెనుక ఓ మాల్‌వేర్ ఉంది. సగటున ప్రతి 595 మోసాల వెనుక ఓ ర్యాన్సమ్‌వేర్(Cyber Horror 2024) ఉంది. హ్యాకర్లు టీమ్‌లుగా ఏర్పడి హ్యాకింగ్ వ్యవహారాలు చేస్తే .. వారిని హ్యాక్టివిస్టులుగా పిలుస్తారు. గత ఏడాది వ్యవధిలో మన దేశంలోని పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, వ్యక్తులపై హ్యాక్టివిస్టులు 5,842 దాడులు చేశారు. గత ఏడాది వ్యవధిలో అత్యంత దుర్వినియోగానికి గురైన ఫైల్‌షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ల జాబితాలో.. గూగుల్ డ్రైవ్, డ్రాప్‌బాక్స్, వన్‌డ్రైవ్, గిట్‌హబ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, వుయ్ ట్రాన్స్‌ఫర్, బాక్స్, అమెజాన్ ఎస్3 బకెట్స్, ఐబీఎం క్లౌడ్, ఒరాకిల్ క్లౌడ్ ఉన్నాయి. ఈ సంస్థలు తమ డేటాను క్లౌడ్‌లో భద్రపరుస్తుంటాయి. ఈ తరహా క్లౌడ్ ఆధారిత ఫైల్ షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లను సైబర్ నేరగాళ్లు టార్గెట్‌గా చేసుకుంటున్నారు.
Also Read :Five MPTCs : ప్రతీ మండలానికి ఐదుగురు ఎంపీటీసీలు.. ఈ ‘సెషన్’లోనే చట్ట సవరణ ?
హ్యాక్ చేసిన ఆన్‌లైన్ డేటాను బ్లాక్ చేసి హ్యాక్టివిస్టులు బెదిరింపు సందేశాలు పంపుతుంటారు. తాము బ్లాక్ చేసిన సమాచారాన్ని తిరిగి ఇవ్వాలంటే డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. దీన్నే ర్యాన్సమ్‌వేర్‌గా పరిగణిస్తారు. ఇలాంటి 10 ప్రధాన ర్యాన్సమ్‌వేర్‌లను గత ఏడాది వ్యవధిలో గుర్తించారు. అవి.. రైసిడా, ర్యాన్సమ్‌హబ్, లాక్‌బిట్ 3.0, ప్లే, బ్లాక్‌బస్టా, 8బేస్, ప్లే, అకీరా, మ్యావ్, రాయల్.