Site icon HashtagU Telugu

VIP Candidates Tracker: వెనుకంజలో ప్రధాని మోడీ.. రెండుచోట్లా లీడ్‌లో రాహుల్

Pm Modi Vs Rahul Gandhi

VIP Candidates Tracker: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే అందరి దృష్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న స్థానాలపై పడింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్ బరేలీ లోక్‌సభ స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి స్థానంలో ప్రధాని మోడీ వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ అజయ్ రాయ్ కు ఇప్పటివరకు 11వేల పైచిలుకు ఓట్లు రాగా, ప్రధాని మోడీకి 5257 ఓట్లు వచ్చాయి. గాంధీనగర్‌లో అమిత్ షా ముందంజలో ఉన్నారు. తిరువనంతపురంలో రాజీవ్ చంద్రశేఖర్ వెనుకంజలో ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఇతర అభ్యర్థులు

* మహారాష్ట్రలో బారామతి నుంచి సుప్రియా సూలే వెనుకంజలో ఉన్నారు.
* యూపీలోని అమేథీ నుంచి స్మృతి ఇరానీ ఆధిక్యంలో ఉన్నారు.
* యూపీలోని కన్నౌజ్ నుంచి అఖిలేష్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు.
* యూపీలోని లక్నోలో రాజ్‌నాథ్ సింగ్ ముందంజలో ఉన్నారు.
* బెంగాల్‌లోని బెర్హంపూర్‌లో అధిర్ రంజన్ చౌదరి ముందంజలో ఉన్నారు.

Also Read : Sharmila : కడపలో వైఎస్‌ షర్మిల వెనకంజ